బిజినెస్

అమ్మకాల ఒత్తిడిలో మదుపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 26: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 53.66 పాయింట్లు పడిపోయి 27,782.25 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 19.65 పాయింట్లు కోల్పోయి 8,572.55 వద్ద నిలిచింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్షకు ముందు మదుపరులు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపగా, శుక్రవారంతో మొదలైన నూతన ఎఫ్‌అండ్‌ఒ సిరీస్‌కు సూచీలు నష్టాలతో స్వాగతం పలికినట్లైంది. ఇకపోతే ఐటి, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, టెక్నాలజీ, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, విద్యుత్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవగా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు, గ్యాస్, ఆటో, టెలికామ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించగా, ఐరోపా మార్కెట్లు ఆరంభంలో నష్టాల్లో మొదలయ్యాయి.

విమానాల్లో సెల్ఫీలపై నిషేధం?
న్యూఢిల్లీ, ఆగస్టు 26: సెల్ఫీల సెగ విమానయాన రంగాన్ని కూడా తాకింది. సెల్ఫీల మోజు ప్రాణాలను హరిస్తున్న నేపథ్యంలో విమానాల్లో వాటి వల్ల ప్రమాదం పొంచి ఉందని విమానయాన రంగ రెగ్యులేటర్ డిజిసిఎ విశ్వసిస్తోంది. ఈ క్రమంలోనే విమానాల్లో సెల్ఫీలు తీసుకోవడంపై నిషేధం విధించాలని, ఇందుకు సంబంధించి కఠినంగా వ్యవహరించాలని ఆయా విమానయాన సంస్థలను డిజిసిఎ త్వరలో ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విమాన సిబ్బందితో సెల్ఫీలను నిరోధించాలని సూచించనుంది.

మార్కెట్‌లోకి బ్రిడ్జ్‌స్టోన్ నూతన టైర్లు
ముంబయి, ఆగస్టు 26: జపాన్‌కు చెందిన టైర్ల తయారీ దిగ్గజం బ్రిడ్జ్‌స్టోన్ కార్పొరేషన్ శుక్రవారం దేశీయంగా వాహనాల కోసం అమెరికాలో చారిత్రాత్మక టైర్ బ్రాండైన ఫైర్‌స్టోన్‌ను పరిచయం చేసింది. కార్ల కోసం ఫైర్‌స్టోన్ ఎఫ్‌ఆర్500ను అందుబాటులోకి తెచ్చిన బ్రిడ్జ్‌స్టోన్.. స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్ (ఎస్‌యువి) కోసం ఫైర్‌స్టోన్ డెస్టినేషన్ ఎల్‌ఇ02ను తీసుకొచ్చింది. నూతన బ్రాండ్‌లో మొదట కార్లు, ఎస్‌యువిలపై దృష్టి పెట్టామని సంస్థ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. చకన్, పుణె ప్లాంట్లతోపాటు ఇండోర్ సమీపంలోని ఖేదా ప్లాంట్‌లో ఈ టైర్లను తయారు చేయనున్నారు.