గెరిల్లా యోధురాలిగా...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా స్టార్ హీరోలందరితో నటించింది. ఇప్పుడు బాలీవుడ్‌వైపు కూడా కన్ను వేసింది. ‘బాహుబలి’తో కొత్తగా వచ్చిన ఇమేజ్ను ‘బాహుబలి-2’లో కూడా చూపిస్తానంటోంది. భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపిన బాహుబలి చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న సినిమాలో తమన్నా పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా వుండబోతోందట. అందుకోసం కత్తియుద్ధాలు, గుర్రపు స్వారీ లాంటివి నేర్చుకుంటోంది. ఈ రెండో భాగంలో గెరిల్లా పోరాట యోధురాలిగా తమన్నా తన సత్తా చూపిస్తానంటోంది. అవంతికగా ఆమె నటన రెండో బాహుబలిలో హైలెట్‌గా వుండబోతోందట. ఇప్పటివరకూ అందాల ఆరబోతతో హాట్‌హాట్‌గా కనిపించిన తమన్నా, ఇప్పుడు పోరాటాలతో దుమ్ము రేపనుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.