అంతర్జాతీయం
అతిపెద్ద విమానానికి ప్రమాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 25 August 2016
![](http://ftp.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/25vimanam_0.jpg?itok=HDGCvAQc)
ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా పేర్కొంటున్న 300 అడుగుల ఎయిర్లాండర్ టెన్ విమానం బుధవారం జరిగిన రెండో ప్రయోగ పరీక్షలో ప్రమాదానికి గురైంది. దాదాపుగంటన్నర సేపు గాలిలో విహరించిన విమానం తిరిగి వస్తుండగా ఉత్తర లండన్ విమాన క్షేత్రంలో నేలను ఢీకొట్టింది. ఈ సంఘటనలో విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదానికి గల కారణాలేమిటో చెప్పలేమని ప్రయోగానికి ముందు అన్ని రకాలుగా తనిఖీ చేశామని హైబ్రీడ్ ఎయిర్ వెహికిల్స్ సంస్థ తెలిపింది.