త్వరలో శాతకర్ణి తర్వాతి షెడ్యూల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. దర్శకుడు క్రిష్ పెళ్లి వేడుకల కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ చిత్రంపై దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ, చిత్రం దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తిచేసుకుందని, ఈ చిత్రం కచ్చితంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుందని గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు. ఇంకొన్ని రోజుల్లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ తిరిగి మొదలుకానుందని తెలిపారు. క్రిష్ తీసిన ‘కంచె’కు సంగీతం అందించిన చిరంతన్ భట్ శాతకర్ణికి కూడా సంగీతాన్ని అందిస్తారు. బాలకృష్ణ సరసన శ్రీయ హీరోయిన్గా నటిస్తోంది. రాజీవ్‌రెడ్డి, క్రిష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు.