ఓ పట్టు పట్టింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కండల వీరుడు బాలీవుడ్ బాద్‌షా సల్మాన్‌ఖాన్ కన్నా ఒక ఆకు ఎక్కువే చదివానంటోంది ముంబై భామ అనుష్కాశర్మ. గతంలో ఆమె నటించిన అనేక చిత్రాల్లో మంచి మార్కులే వేయించుకుంది. అయితే ఈసారి ‘సుల్తాన్’ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌తోపాటుగా రెజ్లర్‌గా అనుష్కా శర్మ నటించింది. మొదట ఈ పాత్రలో అనుష్కాశర్మ నటిస్తోందంటే అందరూ పెదవి విరిచారు. అనుష్కాశర్మకు ఆ పాత్ర నప్పదని, తేలిపోతుందని వ్యాఖ్యానించారు. అయితే ఏం మాయ చేసిందోకానీ, ఆమెపై ఇపుడు ప్రసంశల వర్షం కురుస్తోంది. ‘సుల్తాన్’ చిత్రంలో అనుష్కాశర్మ నటన చూసి అందరూ అవాక్కయ్యారట. కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆమెముందు సల్మాన్‌ఖాన్ నటన కూడా తేలిపోయిందని బాలీవుడ్ విశే్లషకులు చెబుతున్నారు. మొత్తానికి సుల్తాన్‌ను గెలిచిన వనితగా అనుష్కాశర్మ రికార్డు క్రియేట్ చేసింది.