రైతుగా బాలకృష్ణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
![](http://ftp.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/29c8_0.jpg?itok=o0wHg8wh)
ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ జరుపుకుంటోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత ఆయన 101వ చిత్రం గురించి అనంతపురంలో ప్రకటించారు. హిందూపురం ఎమ్మెల్యేగా వున్న బాలకృష్ణ అక్కడి రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీలో భాగంగా తాను తన 101వ చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుంతుందని, ఈ చిత్రానికి ‘రైతు’ అనే పేరు వుంటుందని చెప్పారు. రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు అప్పట్లోనే వచ్చాయి. అయితే తన 100వ చిత్రం ప్రతిష్టాత్మకంగా వుండాలని, తెలుగు ప్రథమ యోధుడు గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత కథతో తెరకెక్కే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ‘రైతు’ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ కూడా జరుగుతున్నట్టు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.