అది అందమైన ఉత్సవం : కృష్ణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మహేష్‌బాబు కథానాయకుడుగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇంత పెద్ద స్టార్‌కాస్ట్‌తో అత్యద్భుతంగా సినిమాను రూపొందించారని హీరో కృష్ణ తెలిపారు. మహేష్‌బాబు, సమంత, కాజల్, ప్రణీత ప్రధాన తారాగణంగా పివిపి సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి రూపొందించిన ‘బ్రహ్మోత్సవం’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో కృష్ణ, విజయనిర్మల, నరేష్ తిలకించారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా స్పందించారు. ఇంకా మాట్లాడుతూ.. దర్శకుడు సినిమాని చాలా అందంగా రూపొందించారని, ప్రతి సీను ‘బ్రహోత్సవం’ లాగే వుందని, ప్రతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. గత సినిమాల్లోకన్నా మహేష్‌బాబు ఈ చిత్రంలో అందంగా కనిపించాడని, ఇంత మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడికి, నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నానన్నారు. తాను ఆడియో ఫంక్షన్లో చెప్పిన విధంగానే ఈ సినిమాలో మహేష్‌బాబు స్టయిల్‌గా అందంగా కనిపించాడని, ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌నెస్ కనిపించిందని, ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు సాంకేతిక నిపుణులందరికీ కంగ్రాట్స్ చెబుతున్నానని, కుటుంబ కథలు నచ్చేవారికి ఈ సినిమా తప్పక నచ్చుతుందని విజయనిర్మల అన్నారు. తన చిన్నతనంలో నటించిన ‘పండంటి కాపురం’ సినిమా తర్వాత అలాంటి చిత్రంలో చాలాకాలం తర్వాత నటించానని, అదే బ్రహ్మోత్సవంగా 40ఏళ్ళ తర్వాత వచ్చిందని, కుటుంబమంతా కలిసి చూడదగిన విధంగా రూపొందిన ఈ చిత్రం మార్నింగ్‌షో నుండే ఆల్‌టైమ్ రికార్డు అందుకుందని నరేష్ తెలిపారు. ఒక మంచి మెసేజ్‌తో రూపొందించిన ఈ సినిమాకు కచ్చితంగా అవార్డు వస్తుందన్న నమ్మకం వుందని, ఇటువంటి చిత్రంలో నటించినందుకు గర్వంగా వుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలను తెలిపారు.