కబీర్‌ఖాన్‌కు చేదు అనుభవం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 27 April 2016
‘బజరంగీ భాయ్‌జాన్’ దర్శకుడు కబీర్ ఖాన్‌కు పాకిస్తాన్లో చేదు అనుభవం ఎదురైంది. లాహోర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కబీర్ పాకిస్తాన్ వెళ్లారు. కరాచీలోని జిన్నా విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగినప్పుడు కొందరు ప్రయాణికులు గుర్తుపట్టి అడ్డుకున్నారు. బజరంగీ చిత్రంలో పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా చూపడాన్ని వారు తప్పుబట్టారు. భారతీయ గూడచార సంస్థ ‘రా’ పాకిస్తాన్లో చేపడుతున్న కార్యక్రమాలపై ఎందుకు నోరుమెదపరని వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఓ ప్రయాణికుడు కబీర్‌పై బూటు విసిరాడు. నిజానికి ‘బజరంగీ భాయ్‌జాన్’ చిత్రాన్ని పాకిస్తాన్ ప్రజలు ఆదరించారు.