మెయిన్ ఫీచర్

బ్రహ్మనిష్ఠకు విఘాతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
బీజము అంకురించిన మొదలు, కార్య రూపంలో వృక్ష సంరక్షణ చేసినపుడు ఫలము, మరల బీజము లభ్యవౌనుకదా. అట్లే ఆలోచన కార్యం. అహంకారం, వికారములన్నింటిలోకి అతి లీయమైనది వికార పూరితమైన ఆలోచనా స్రవంతి యందే అహంకారము పునరుద్భవించును. దానిని నిరోధించుటకు విషయ చింతనపై మనస్సు మరలుటకు ఇసుమంత అవకాశమివ్వక సావధానముగా బ్రహ్మనిష్ఠతో అహర్నిశలు ఉండుటయే కర్తవ్యము. బ్రహ్మ నిష్ఠకు అంతరాయము కలిగిన సంసార బంధము వీడదు.
314
వాసనావృద్ధితః కార్యం కార్య వృద్ధ్యా చ వాసనా
వర్ధతే సర్వథా పుంసః సంసారో న నివర్తతే
వాసనల శేషము అల్ప మాత్రమున్నను దానివలన కార్యము వృద్ధి చెందును. కార్యవృద్ధి వలన వాసనలు పెరుగును. అందువలన పురుషుడు ఎన్నటికి సంసార బంధనము నుండి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడును. ముందు శ్లోకములలో కార్యమనగా విషయ చింతన అనిస్పష్టము చేయబడినది. మనస్సు విచలితమై బ్రహ్మనిష్ఠకు విఘాతము కలిగించే కార్యముల పైకిమరలిన వాసనలు పునః పెరిగి ఉత్తేజితము వౌను. వాసనా పరమైన వికారములు సంపూర్ణముగా విచ్ఛిన్నమయ్యేవరకు మనిషికి సంసార బంధము నుండి విముక్తి లభించదు.
315
సంసారబన్ధవిచ్ఛితె్తై్య తద్ద్వయం ప్రదహేద్యతిః
వాసనా ప్రేర్యతే హ్యన్త శ్చిన్తయా క్రియయా బహిః॥
యతీంద్రుడు లేక మోక్షేచ్ఛగల సాధకుడు సంసార బంధవిముక్తికొరకు వాసన తజ్జనిత కార్యమును శేష రహితముగ దహించి వేయాలి. మనోవ్యాపారమైన విషయ చింతన అంతఃకరణలో జరుగును. క్రియా రూపము కర్మేంద్రియాల ద్వారా బాహ్యముగా ప్రకటితవౌను. అంతరేంద్రియములు, బాహ్యేంద్రియములు, జడ రూపములు. భారూపమైన ఆత్మ ప్రతిఫలించనిచో చిత్తవృత్తి జరగదు, కార్యాచరణ ఉండదు. అహంకారము దగ్ధమైపోయిన విషయ చింతనకుకాని, అది కార్యరూపము దాల్చుటకుగాని, ఎట్టి అవకాశము ఉండదు. కాలిన బీజములు అంకురించవుకదా! అందువలన, సంసార బంధవిముక్తిని ఆశించే జిజ్ఞాసువులు, విషయ చింతనను పూర్తిగా జ్ఞానాగ్నిలో దగ్ధము చేయవలెను.
316
తాభ్యాం ప్రవర్థమానా సా సూతే సంసృతిమాన్మనః
త్రయాణాం చ క్షయోపాయః సర్వావస్థాసు సర్వదా॥
317
సర్వత్ర సర్వతః సర్వ బ్రహ్మమాత్రావలోకనమ్‌
సద్భావ వాసనాదార్‌ఢ్యాత్ తత్త్రయం లయ మశ్నుతే॥
విషయములు, వాటి చింతన, క్రియ అనే మూడు సంసార బంధవిముక్తికి ప్రతిబంధకములు పరబ్రహ్మము సర్వత్ర, జగత్సర్వమూ వ్యాపించి ఉన్నదనే భావనతో, సర్వావస్థలందు ఉన్నచో బ్రహ్మాభిన్నమైనదేదియు గోచరించదు. సమస్తము బ్రహ్మాత్మ భావనతో ఆత్మయందు లయమవగా ఇతరములేవి స్పృశించవు. విషయములు, విషయ చింతన, క్రియ అనే మూడు బ్రహ్మమందే విలీనమైపోవు.
‘‘బ్రహ్మైవేదమమృతం పురస్తాద్బ్రహ్మ పశ్చాద్బ్రహ్మ దక్షిణ తశ్చోత్తరేణ అధశ్చోర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠమ్’’ (నాశ రహితమైన బ్రహ్మమే ముందు భాగమందు, వెనుక భాగమందు, కుడివైపున, ఎడమవైపున, అధోభాగములోను, సర్వత్ర యావత్ విశ్వములో వ్యాపించి ఉన్నది. కార్యరూపమైన జగత్తులో పరబ్రహ్మము తప్ప ఇంకొకటి లేదు- ము.ఉ.2-2-11)
‘‘యత్ర తు అస్య సర్వమత్మైవాభూత్ తత్ కేన కం పశ్యాత్’’ బ్రహ్మాత్మతత్త్వం తెలుసుకున్న వ్యక్తికి నానాత్వభావన ఉండదు (బృ.ఉ.4-5-15). బ్రహ్మాత్మభావనతో ఆత్మసాక్షాత్కారం పొందిన జ్ఞానికి క్రియా-కారక- ఫల లక్షణాలున్న వ్యవహారంతో ఏ ప్రమేయం ఉండదని సూత్ర భాష్యంలో శంకరులవారు నిర్ధారించారు (బ్ర.సూ.2-1-14).
బ్రహ్మైక్యత పొందిన సాధకునిలో సద్భావవాసన అత్యంత దృఢమగును. అందువలన, విషయము-విషయ చింత-క్రియ అనే మూడూ పూర్తిగా దగ్ధమై నశించిపోవును.
318
క్రియనాశే భవేచ్చిన్తానాశో‚ స్మాద్వాసనాక్షయః
వాసనా ప్రక్షయో మోక్షః స జీవన్ముక్తిరిష్యతే॥
క్రియ నశించగా విషయ చింతన ఉండదు. విషయ చింతన నశించగా బీజ రూపములోనుండే దాని వాసన సహితము క్షయమగును. వాసనాక్షయంతో మోక్షము ప్రాప్తించును. అదియే జీవన్ముక్తి.
ఇంకా ఉంది