మెయిన్ ఫీచర్

సంచితకర్మ రూపములో సంసారబంధము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
445. ప్రాచీన వాసనావేగాదసౌ సరసరతీతి చేత్‌
న సదేకత్వ విజ్ఞానాన్మన్దీ భవతి వాసనా॥
గత జన్మలలో చేసిన కర్మల ఫలితంగా, అనగా సంచితకర్మ రూపములో సంసారబంధము ఏర్పడుతున్నది, మరి వాటి వాసన నశించుట సంభవమా అని శంకించిన, అట్టి సంశయమునకు తావులేదు. అద్వితీయము, ప్రజ్ఞాన మనస్వరూపమైన ఆత్మసాక్షాత్కారముతో సుకృత దుష్కృత ఫలము శేషరహితముగా అంతమైపోవును. అందువలన, వాసన కొనసాగుట అసంభవము.
‘‘స యో హ వై తత్పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి’’అని శ్రుతి తార్కాణము (పరబ్రహ్మమును తెలిసికొనిన బ్రహ్మవేత్త బ్రహ్మమే అగును- ము.ఉ.3-2-9). సదాత్మ, నిర్మలము, నిష్క్రియి. కర్తృత్వభోక్తృత్వములులేని జీవాత్మకు వాసనలేవి ఉండవు. ‘‘బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి’’(బ్రహ్మస్వరూపమైన బ్రహ్మమును పొందుతున్నాడు- బృ.ఉ.4-4-6). అందువలన, అంతములో నిర్గుణపరబ్రహ్మములో లయమైన బ్రహ్మవేత్త, శాశ్వతముగా భవబంధ విముక్తి పొందుననుటలో సందేహము ఏమియూలేదు.
446. అత్యన్త కాముకస్యాపి వృత్తిః కుణ్ఠతి మాతరి
తథైవ బ్రహ్మణి జ్ఞాతే పూర్ణాననే్ద మనీషిణః॥
ఎంత కాముకుడు, కామపీడితుడైనా పై వారియందు చూపిన ఆవేశమును కన్నతల్లి విషయములో చూపడు. వికార రహితముగా, అతి సావధానముగా, మిక్కిలి జాగరూకతతో వ్యవహరించును. అట్లే, అఖండానంద స్వరూపమైన పరమాత్మతత్త్వమును తెలిసికొన్న బ్రహ్మవేత్త. ఉపరమ సాధించి అసంగుడగును. వాని సమస్త కర్మఫలము జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయి దేహవాసన, లోకవాసన, శాస్తవ్రాసన అడుగంటిపోవును.
క్రియారహితుడై మోక్షముపొందాలనే ఏకైక లక్ష్యముతో ప్రపంచమును విస్మరించి, పరమాత్మతో తన ఆత్మను సంలగ్నముచేసిన సాధకుడు అకుంఠిత దీక్షతో తన గమ్యమును చేరుకొనును. అచిరకాలములో వానికి ఆత్మసాక్షాత్కారము లభ్యమై, భవబంధము వీడిపోవును. దేహపతనముతో విదేహముక్తి పొంది పరబ్రహ్మములో విలీనమైపోవును.
ప్రారబ్ధము అసంభవము
447. నిదిధ్యాసనశీలస్య బాహ్యప్రత్యయ ఈక్షతే
బ్రవీతి శ్రుతిరేతస్య ప్రారబ్ధం ఫలదర్శనాత్‌॥
నిదిధ్యాసనముచేసే స్వభావముగల జిజ్ఞాసువునకు బాహ్యజ్ఞానము కల్గుతున్నది. దానివలన, సాధకునకు కలిగే ఫలము చెప్పబడినది. నిదిధ్యాసనము నిర్వికల్పసమాధి కాదు. అందుచేత, నిదిధ్యాసనము చేస్తున్న వానికి కర్తృత్వభోక్తృత్వ ఫలము ఉన్నది. తత్త్వజ్ఞాన ప్రాప్తికై శ్రవణమననాదులతోపాటు నిదిధ్యాసనము అనివార్యము. అయితే, నిరంతర ఆత్మవిచారణ గావించిన పిదప బ్రహ్మభూతుడై, నిర్వికల్ప సమాధిస్థితిలో ప్రవేశించనిదే ఆత్మదర్శనము కాదు.
ముందు సూచించినట్లు సవికల్ప స్థితిలో జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము (త్రిపుటి) భేదము నశించదు. అందువలన, బాహ్యముఖుడై ధ్యానము చేసే సాధకునకు సుఖదుఃఖానుభవము నశించదు. దానినే శ్రుతి ‘‘న హ వై సశరీరస్య సతః ప్రియాప్రియయోరపహతి రస్తి’’అని ప్రకటిస్తున్నది (శరీరమందు ఆత్మత్వాభిమానము కలిగియున్న పురుషునకు బాహ్యవిషయ సంయోగజన్యమైన ఇష్టానిష్టవిషయముల విచ్ఛేదము లేదు ఛా.ఉ.8-12-1). నిదిధ్యాసనములో నిమగ్నమై ఉన్నప్పటికీ, చిదానంద స్వరూపస్థితికి చేరనందున, శరీరమునకు అనగా బుద్ధ్వాదులకు ఆత్మతో అధ్యాసచే ఏర్పడిన సంబంధము వీడిపోదు. ఆ దశలో ప్రారబ్ధకర్మఫలము అనుభవయోగ్యము.
నిర్వికల్పసమాధిలో త్రిపుటి భేదము శూన్యమై, సర్వమూ ఏకాకార పరబ్రహ్మములో లయవౌను. అందువలన, ఆత్మదర్శనమైన వెనె్వంటనే బ్రహ్మవేత్త జీవన్ముక్తిని పొందును. ‘‘తస్య తావదేవ చిరంయావన్న విమోక్ష్యే‚్ధ సంపత్స్యే’’అను శ్రుతియే దీనికి ప్రమాణము (ఎంతవరకు పూర్వకర్మారబ్ధమైన ఈ దేహము పతనముకాదో, అంతవరకే విదేహముక్తి పొందుటకు ఆలస్యవౌను- ఛా.ఉ.6-14-2).
ఇంకా ఉంది