మెయిన్ ఫీచర్

సర్వం బ్రహ్మమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
జీవన్ముక్తుడు గతానుభవములను నెమరువేసుకొని ఆనందించడు. వ్యధనూ చెందడు, అదేవిధముగా మున్ముందు ఏమి జరుగనున్నదో అనే భీతి చెందడు. అట్లే, ప్రస్తుతము ఉన్న పరిస్థితి విషయములోనూ ఉదాసీనముగా నుంటూ, పరమాత్మ ధ్యానములో నిరంతరము నిమగ్నమై . ఓర్మితో దేహాంతర ప్రాప్తికై నిరీక్షించును.
434 గుణదోష విశిష్టే స్మిన్ స్వభావేన విలక్షణే
సర్వత్ర సమదర్శిత్వం జీవన్ముక్తస్య లక్షణమ్
సత్త్వరజస్తమోగుణములు ప్రకృతి జనితములు, అందువలన ప్రపంచములో గుణదోషములుండుట స్వభావ సిద్ధము. సామాన్యము,. ఆత్మజ్ఞానిలో సర్వాత్మకతాభావము నెలకొనును. సర్వ భఊతములందు సమభావనతో, గుణదోషములను ఎన్నడునూ ఎంచక, వైషమ్యాదులు లేక సర్వత్ర వ్యవహరించుటయే జీవన్ముక్తుని లక్షణము.
‘నిర్వైరస్సర్వభూతేషు యస్స మమేతి’’ సమస్త ప్రాణికోటి యందు వైషమ్యము లేనివాడు పరమాత్మను పొందుచున్నాడు. భ.గీ. 11-55 యోగి , అన్నింటిని సమభావనతో చూచునని చేసిన బోధన కూడా సందర్భోచితము.
సర్వభూతస్థమాత్మానాం సర్వభూతాని చాత్మని
ఈక్షతే యోయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః
అద్వితీయమైన పరబ్రహ్మమే సర్వప్రాణుల హృదయస్థానమందు స్థిరముగా ఉంటూ చేతనత్వమును కల్పిస్తున్నది తెలిసికొనిన యోగి, సమదృష్టి కలిగినవాడై, అన్ని ప్రాణులందూ తన ఆత్మస్వరూపమునూ తన ఆత్మలోనే సర్వభూతములనూ చచ్చును
- భ.గీ. 6-29
435 ఇష్టాన్టిఃర్థ సంప్రాప్తౌ సమదర్శిత యాత్మని
ఉభయత్రావికారిత్వం జీవన్ముక్తస్య లక్షణమ్
ఆత్మజ్ఞానికి దేనిలోను ద్వంద్వ భావము ఉండదు. అందువలన ఇష్టమైనది ప్రాప్తించినపుడు హర్షము ఉండదు. ఇష్టములేనిదానిని స్వీకరించినపుడు కూడా ఏవిధమైన జుగుప్స ఉండదు. ఎటువంటి నిరాశ, బాధ కలుగదు. మనోవికారములు లేక సర్వదా ప్రసన్నచిత్తుడై తృప్తిగా ఉండటమే జీవన్ముక్తుని లక్షణము. ‘నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు’’ ఇష్టానిష్ట ప్రాప్తమందు సమచిత్తత్వము కలిగి ఉండటయే తత్త్వజ్ఞానమని గీతోపదేశము - భ.గీ. 13-9
436 బ్రహ్మా నన్దర రసా సాస్వాదాసక్త చిత్తతయా యతేః
అస్తర్భహిర విజ్ఞానం జీవన్ముక్తస్య లక్షణమ్
అనుక్షణము బ్రహ్మానందరసా స్వాదనలో మునిగి ఉన్న కారణముగా అంతరజ్ఞానము, బాహ్య విషయ జ్ఞానము రెండునూ లేకపోవుటయే జీవన్ముక్తుడైన జితేంద్రుని లక్షణము
యో న్తస్సు ఖో స్తరారామ స్త్థా న్తర్జ్యోతి రేవయః
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మ భూతో ధిగచ్ఛతి
ఎవడు ఆత్మసుఖియై ఆత్మారాముడై జ్ఞాన స్వరూపియై అంతఃప్రకాశవంతుడై ఉండునో , ఆ యోగి (జితేంద్రియుడు) బ్రహ్మస్వరూపియై మోక్షమును పొందును. భ.గీ. 5-24
437 దేహేన్ద్రియాదౌ కర్తవ్యే మమాహంభావ వర్జితః
ఔదాసీనే్యన యస్తిష్ఠేత్ స జీవన్ముక్త ఇష్యతే.
దేహము, అంతర్భాహ్యేంద్రియముల వినియోగముతో ఏ పని చేసినా అట్టి సమస్త కార్య నిర్వహణలో అహంకారము, మమకారము ఏ జిజ్ఞాసువునందు శూన్యమగునో అతడు జీవన్ముక్తుడనబడును.
నేను అనే అహంభావము, ఈ దేహము నాది, ఈస్థలము నా సొత్తు ఇత్యాది భావన గాని, వీరు నా వారు, నన్నాశ్రయించి ఉన్నవారు అనే తలంపుగాని లేనివాడే జీవన్ముక్తుడు.
438 విజ్ఞాత ఆత్మనో యస్య బ్రహ్మభావః శ్రుతేర్బలాత్
భవబన్ధ వినిర్ముక్తః స జీవన్ముక్త ఇష్యతే
శ్రుతి సోహం తత్త్వమసి ఇత్యాది వాక్యాలతో జీవన పరమాత్మల అభిన్నతను ప్రకటిస్తున్నది. తదాధారంగా ఏ జిజ్ఞాసువు పరిపూర్ణ తత్త్వజ్నామును పొంది ఆత్మావలోకనము చేసుకొనునో అతడు భవబంధ విముక్తుడౌను. అట్టి ఆత్మవేత్త జీవన్ముక్తుడు.
439 దేహేన్ద్రియేష్వహంభావః ఇదంభావస్తదన్యకే
యస్య నో భవతః క్వాపి స జీవన్ముక్త ఇష్యతే
ఎవనికి దేహేంద్రియ సముదాయమందు నేను అనే భావన ఇతన ఆత్మేతర జడపదార్థములందు ఇది అనే భావన ఎన్నడూ ఉండదో అతడే జీవన్ముక్తుడుగా అంగీకరించబడును. ఇంకొక విధముగా కూడా దీనిని స్పష్టము చేయవచ్చును. ఆత్మజ్ఞానికి నానాత్వభావన ఉండదు. సర్వమూ బ్రహ్మమయమే. అందువలన నశ్యమయే తన దేహేంద్రియములపై ఉన్న దృష్టియే, ఇతర అనిత్య పదార్థములపై ఉండును. బ్రహ్మమే సత్యము.

ఇంకా ఉంది