హైదరాబాద్

వృథా తగ్గించి.. రెవెన్యూ పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తాగునీటి వృథాను తగ్గించి, బోర్డుకు రావల్సిన బకాయిలను ఎప్పటికపుడు వసూలు చేసి రెవెన్యూను పెంచాలని అధికారులను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ ఆదేశించారు. కమర్షియల్ కనెక్షన్లకు సంబంధించి ఇప్పటి వరకు పేరుకుపోయిన బకాయిల్లో సుమారు ఇరవై శాతం కచ్చితంగా వసూలు చేయాల్సిందేనంటూ డెడ్‌లైన్ విధించి, టార్గెట్లు విధించారు. బుధవారం బోర్డు ప్రధాన కార్యాలయంలో ఎండీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎండీ మాట్లాడుతూ రెవెన్యూ పెంచుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగానే కమర్షియల్ కనెక్షన్ల బకాయిల వసూళ్లని పేర్కొన్నారు. ప్రతి నెల వసూలు చేసే రెవెన్యూతో పాటు కమర్షియల్ బకాయిల్లో ఇరవై శాతం ఖచ్చితంగా వసూలు చేయాల్సిందేనని ఆదేశించారు. రెవెన్యూ వసూళ్లలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా వ్యవహారించిన కఠిన చర్యలు తప్పవని అల్టిమేటం జారీ చేశారు. మంచినీటి సరఫరా మొదలైన ఐదు నుంచి 15 నిమిషాలు నీటిని వృథాగా వదిలేస్తున్న ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో నీటి వృథాను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని నీటి వృథాపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, వృథాను తగ్గించేలా కృషి చేయాలని సూచించారు. సీవరేజీ, మంచినీటి పైప్‌లైన్లు కలిసి ఉన్న ప్రాంతాల్లో మంచినీటిలో మురుగునీరు కలిసే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పైప్‌లైన్లకు మరమ్మతులను చేసేందుకు అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. మంచినీటి పైప్‌లు, వాల్వులు ధ్వంసమై మంచినీరు వృథా అవుతున్న పైప్‌లైన్లను కూడా గుర్తించాలని సూచించారు. ఈ అంశాలపై పది రోజుల్లో నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వాక్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి మంచినీటి వాడకంపై బ్రాండింగ్ గుర్తులు కేటాయించే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జలమండలి ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పీ.రవి పాల్గొన్నారు.