హైదరాబాద్
రోడ్డెక్కని ఆటోలు, క్యాబ్‌లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఖైరతాబాద్: కోవిడ్‌ను కట్టడి చేసేందుకు నగర ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనడంతో మహానగరంలో వాయు కాలుష్యం తగ్గింది. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మరి కరోనాను కట్టేటి చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు అనుహ్య స్పందన లభించడంతో ఇది సాధ్యం అయింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు సైతం తమకు తాముగా బంద్‌ను పాటించాయి. దీంతో వాహనాలు రోడ్లు ఎక్కలేదు. నిత్యం లక్షలాది వాహనాలతో రద్దీగా ఉండే అనేక చౌరస్తాలు నిర్మానుష్యంగా కనిపించాయి. ముఖ్యంగా పంజాగుట్ట, లక్డీకపూల్, కోఠి, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, హెటెక్ సిటీ చౌరస్తాలు వాహనాలు లేకపోవడంతో వెలవెలబోయాయి. ఆదివారం నగరంలోని అన్ని రహదారులపై పోలీసులు, జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన వాహనాలు తప్ప ఇతర వాహనాలు రాకపోకలు సాగించలేదు.