హైదరాబాద్
పోరుకు 1.4 మిలియన్ల మంది రెడీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్న భారత్‌కు చెందిన వైద్యులు కోవిడ్-19కు చెందిన వైరస్ మహమ్మారిపై పోరాటం చేయాలని, ఈ వైరస్ బారి నుంచి మానవాళిని కాపాడాలని గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఓరిజన్, ది అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పిజీషియన్స్ ఆఢఫ్ ఇండియన్ ఆరిజన్, బ్రిటీష్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా జీఏపీఐవో చైర్మన్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఫౌండర్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి మాట్లాడుతూ, మనం మూడో ప్రపంచ యుద్ధంతో పోరాడుతున్నామన్నారు. రెండు వందల దేశాల్లో వంద రోజుల్లో ఈ వైరస్ వ్యాపించిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు చెందిన వైద్యులువ 1.4 మిలియన్ల మంది ఉన్నారని, మనమంతా సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్లు, నర్సులు, సాంకేతిక నిపుణులు, పారామెడికల్ స్ట్ఫా ఎనలేని సేవలు అందిస్తున్నారని ఏఏపీఐ అధ్యక్షుడు డాక్టర్ సురేష్‌రెడ్డి పేర్కొన్నారు.