బిజినెస్

నేడు దేశవ్యాప్త ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: పది జాతీయ కార్మిక సంఘాలు సంయుక్తంగా బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈక్రమంలో దేశ వ్యాప్తంగా బ్యాంకుల్లో లావాదేవీలకు ఆటంకం కలుగనుంది. ఇప్పటికే మెజారిటీ శాతం బ్యాంకులు ఈ సమ్మె విషయాన్ని స్టాక్ ఎక్చేంజీలకు తెలియజేయడం జరిగింది. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓఏ)లతోబాటు బ్యాంక్ కర్మచారీ సేనా మహాసంఘ్ (బీకేఎస్‌ఎం), బీఈఎఫ్‌ఐ, ఐఎన్‌బీఈఎఫ్, ఐఎన్‌బీఓసీలతోబాటు వివిధ కార్మిక సంఘాలు ఈ సమ్మెకు మద్దతిస్తున్నాయి. ఈక్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్ క్లియరెన్స్ వంటి సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఐతే ప్రైవేటు బ్యాంకుల్లో లావాదేవీలు యథావిధిగానే సాగుతాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతున్న ఈ సమ్మెకు దేశ వ్యాప్తంగా 25 కోట్ల మంది మద్దతు ఉందని ఈ సందర్భంగా కార్మిక సంఘ నేతలు పేర్కొన్నారు. ఈనెల 2న జరిగిన సంప్రదింపుల సమావేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఎంతమాత్రం చొరవ చూపలేదని, కార్మిక చట్టాలను కాలరాచే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందని దుయ్యబట్టారు.
‘సమ్మె విరమింపజేయండి’
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు బుధవారం చేపట్టనున్న దేశ వ్యాప్త సమ్మెను విరమింపజేయాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉన్నతాధికారులను ఆదేశించింది. అలాగే బ్యాంకులు సజావుగా నడిచేందుకు, అభివృద్ధికి అవసరమైన ఓ మిగులు ప్రణాళికను ఉద్యోగులు సూచించాలని ప్రభుత్వం కోరింది. బ్యాంకుల్లోని ఏ విభాగానికి చెందిన ఉద్యోగి అయినా సమ్మెలోకి వెళ్లినా, నిరసన తెలిపినా అందుకు బాధ్యతవహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రత్యేకించి వేతనాల్లో కోత, క్రమశిక్షణా చర్యల వంటివి తప్పదని మంగళవారం నాడిక్కడ విడుదలైన ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ విభాగాల్లో సహేతుక అభివృద్ధి నిమిత్తం ఓ మిగులు ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని, దానికి ఉద్యోగులు, కార్మికులు తగిన సూచనలు, సలహాలు అందించాలని సూచించింది.