అంతర్జాతీయం

సోమాలియాలో 76 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగదిషు, డిసెంబర్ 28:సోమాలియా రాజధాని మొగదిషులో శనివారం జరిగిన ట్రక్కు బాంబు విస్ఫోటనంలో 76మంది దుర్మరణం చెందారు. పేలుడు పదార్థాలతో నిండిన ఈ ట్రక్కు అత్యంత జనసమ్మర్ధంగా, వాహనాలతో నిండిన ప్రాంతంలో పేలిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ట్రాఫిక్ తనిఖీల కారణంగా ఆ ప్రాంతంలో ఆగిన యూనివర్శిటీ విద్యార్ధుల బస్సు కూడా పేలుడు ప్రభావానికి గురైందని, మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులేనని అధికారులు వెల్లడించారు. భద్రతాపరమైన తనిఖీల కారణంగా నిలిచిపోయిన వాహనాల మధ్య ఈ పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. పేలుడు తీవ్రతకు మృతుల దేహాలు చిన్నాభిన్నమయ్యాయని, ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైందని తెలిపారు. అలాగే అనేక వాహనాలూ తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. మొగదిషులో కారు బాంబు పేలుళ్లకు ఇస్లామిక్ ఉగ్రవాదులు పాల్పడటం తరచు జరుగుతున్నదే అయినా శనివారం జరిగిన ఘటన అత్యంత తీవ్రమని, ఇటీవల కాలంలో ఇంత మంది మరణించడం జరుగలేదని అధికారులు తెలిపారు. యూనివర్శిటీ విద్యార్ధుల బస్సుపై బాంబు పేలుడు ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల పెద్ద సంఖ్యలో విద్యార్ధులు మరణించారని తెలిపారు. మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ పేలుడుకు ఏ మిలిటెంట్ సంస్థ బాధ్యత వహించనప్పటికీ కచ్చితంగా ఇది మిలిటెంట్ల పేనన్న అనుమానం వ్యక్తమవుతోంది. దేశంలో ఇలాంటి దాడులకు పాల్పడేది అల్ షబాబ్ అనే మిలిటెంట్ సంస్థేనని, సోమాలియా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈ సంస్థ దశాబ్దానికి పైగా పోరాడిందని చెబుతున్నారు. ఇందులో దాదాపు9 వేల మంది మిలిటెంట్లు ఉండవచ్చునన్న అంచనావేస్తున్నారు. మొదట్లో ఈ మిలిటెంట్ సంస్థ అల్ ఖైదాకు అనుబంధంగా ఉన్న ఈ సంస్థ దేశంలోని అనేక ప్రాంతాలపై పట్టు సాధించింది. అడపాదడపా అధికారులపై గెరిల్లా యుద్ధానికీ పాల్పడుతోంది. రెండు వారాల క్రితం ఈ మిలిటెంట్ సంస్థ ఓ హోటల్‌పై జరిపిన దాడిలో ఐదుగురు మరణించారు. 2017 అక్టోబర్‌లో జరిగిన అత్యంత తీవ్రమైన కారు బాంబు దాడలో 512మంది మరణించారు. దాదాపు మూడొందల మంది గాయపడ్డారు.
'చిత్రం... ట్రక్కు బాంబు పేలిన సోమాలియా రాజధాని మొగదిషులోని రద్దీ ప్రాంతం