హైదరాబాద్

వాహనదారులకు నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ట్రాఫిక్ పోలీసులంటే వాహనాలను చెక్ చేసి ఎదో ఒక సాకుతో చలాన్లు విధిస్తారు అనే భావన నుంచి వాహనదారులకు నజరానాలను అందిస్తూ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. పగలనక, రాత్రనక నగర రహదారులపై విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులంటే ప్రతి ఒక్కరికి చులకన భావం ఉండేది. ప్రభుత్వ నిబంధనలను అమలు పరుస్తున్న క్రమంలో వాహనదారుల నుంచి విమర్శలకు గురికావాల్సి వచ్చేది. ఇదంతా గతం మాత్రమే అనే విధంగా నగర ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు చేరువ అవుతున్నారు. నిబంధనల ప్రకారం వాహనాలను నడిపేవారిని గుర్తించి వారికి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌లను అందిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు తమ కోసం కాదు రోడ్లపై నడిచే ప్రతి ఒక్కరి కోసం అంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వాహన నిబంధనలు పాటించని వారికి భారీ స్థాయిలో అపరాధ రుసుములు విధించేలా చట్టం చేసినా ప్రస్తుతం నగరంలో అమలు చేయక పోయినా వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. కేంద్రం జరిమానాలు పెంచినప్పుడు నగరంలోని పలు కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి పాజిటివ్ కోణంలో ప్రచారం నిర్వహించారు. గతంలో లాగా కఠినంగా కాకుండా ప్రజలకు అర్ధమయ్యే రీతిలో అవగాహన చేపడుతున్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా పోలీసులకు చిక్కినవారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి మొదటి తప్పిదంగా వదిలివేస్తున్నారు. మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నగర రహదారులను ప్రమాద రహితంగా తీర్చిదిద్దేందుకు పలు రకాలుగా ట్రాఫిక్ పోలీసులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా జరిమానాలు విధించడమే కాదు, నిబంధనలు పాటించే వారిని గుర్తిస్తామంటూ ముందుకు వచ్చారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు అనుగుణంగా వాహన కాగితాలతో పాటు లెసెన్స్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ పాటించే వారిని గుర్తించి నగరంలోనే ప్రముఖ సినిమా థియేటర్ల టికెట్లుతో పాటు ప్రముఖ రెస్టారెంట్ల కూపన్లను అందజేస్తున్నారు. పోలీసులు చేస్తున్న ఈ చర్యకు వాహనదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.