బిజినెస్

భారత్‌లో స్థిరాస్తి వాణిజ్యాన్ని విస్తరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారతలో తమ పెట్టుబడులను కొనసాగిస్తామని, ప్రత్యేకించి స్థిరాస్తి రంగంలో ఒక ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవడంతోబాటు, జాయింట్ వెంచర్ల ద్వారా ప్రాజెక్టులను చేపడతామని దుబాయ్‌కి చెందిన ‘ఎమ్మార్ ప్రాపర్టీస్’ బుధవారం నాడిక్కడ తెలిపింది. భారత్‌లో అతిపెద్ద స్థిరాస్తి వాణిజ్య సంస్థగా విస్తరించాలన్న లక్ష్యంగా సాగుతున్నామని, ముంబయి, పూనేల్లో ప్రస్తుతం వాణిజ్య విస్తరణ జరుగుతోందని, అలాగే జాయింట్ వెంచర్ల నిర్వహణ నిమిత్తం భాగస్వాములతో చర్చలు సాగుతున్నాయని వివరించింది. ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులన్నింటినీ త్వరిత గతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని, అలాగే హోటళ్ల ఆస్తుల వంటి ప్రాధాన్యత లేని ఆస్తులను విక్రయించేందుకు నిర్ణయించామని తెలిపింది. ఇలాంటి ఆస్తులు జైపూర్, కొచ్చిన్, మంగళూర్, గోవా తదితర నగరాల్లో ఉన్నాయని ఎమ్మార్ ప్రాపర్టీస్ సీఈవో (ఇంటర్నేషనల్) హాదీ బద్రి తెలిపారు. తమకు ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉన్న దేశాల్లో యూఏఈ, ఈజిప్టుతోబాటు భారత్ కూడా ఒకటని, అందుకే ఇక్కడ వాణిజ్య విస్తరణపై ప్రధాన దృష్టి నిలిపామని వివరించారు. భారత్‌కు స్ధిరాస్తి రంగంలో రానున్న 20 నుంచి 30 సంవత్సరాలు బంగారు భవిష్యత్తు ఉందని, ఈ అభివృద్ధిలో తమ సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. తమవద్ద అతిపెద్ద భూమి బ్యాంకు ఉందని వాటిని అభివృద్ధి చేయాల్సివుందని తెలిపారు. ఇప్పటికే తమ కంపెనీ 90 శాతం ప్రాజెక్టులను విక్రయించిందని, 80 శాతం ప్రాజెక్టులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని బద్రి తెలిపారు. 2005 నుంచి శ్రమించి పెండింగ్ ప్రాజెక్టులను జాయింట్ వెంచర్ భాగస్వామి ద్వారా పూర్తి చేయించామన్నారు. భారత్‌లో స్థిరాస్తి రంగంలో ఎంజీఎఫ్ గ్రూప్ భాగస్వామ్యంతో తమ సంస్థ ఇప్పటి వరకు రూ. 8,500 కోట్లు పెట్టుబడులు మదుపు చేశామన్నారు.