హైదరాబాద్

‘బాలదీప్తి’ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : ప్రముఖ రచయిత్రి ఎంవీ గాయత్రిదేవి రచించిన ‘బాలదీప్తి’ పుస్తకావిష్కరణ సభ జీవీ ఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, వైఎస్‌ఆర్ మూర్తి, పద్యకవి ఎస్‌వీ అనంత కృష్ణ, పద్యశ్రీ లత, సంస్థ చైర్మెన్ గుదిబండి వెంకట రెడ్డి పాల్గొన్నారు.

21న ‘నైషధం’ గ్రంథావిష్కరణ
హైదరాబాద్, అక్టోబర్ 14: వైఎస్‌ఆర్ మూర్తి చారిటబుల్ ట్రస్టు, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కవి త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యం రచించిన ‘నైషధం’ గ్రంధావిష్కరణ సభను ఈనెల 21న సాయంత్రం 5.30 గంటలకు చిక్కడపల్లిలోని శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. వోలేటి పార్వతీశం సభాధ్యక్షత వహించనున్న కార్యక్రమానికి ప్రముఖ చారిత్రక నవలా చక్రవర్తి ప్రొ.ముదిగొండ శివప్రసాద్ ముఖ్యఅతిథిగా, త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన్ మూర్తి, గాయని వై.కామేశ్వరి ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నట్లు వివరించారు. గ్రంథావిష్కరణ అనంతరం సాధన సమితి స్రవంతి అధ్యక్షులు సాధన నరసింహచార్యులు గ్రంథ సమీక్షలు నిర్వహించిన అనంతరం వైఎస్‌ఆర్ మూర్తి చారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ వైఎస్‌ఆర్ మూర్తి శుభాకాంక్షలు తెలియజేయనున్నట్లు తెలిపారు.
20న ‘గురువందన మహోత్సవ వేడుకలు’

హైదరాబాద్, అక్టోబర్ 14: శ్రీకమలాకర చారిటబుల్ ట్రస్టు, శ్రీకమలాకర లలిత కళాభారతి సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20న నగరంలో రాష్టప్రతి అవార్డు గ్రహీత, రిటైర్డు ప్రిన్సిపాల్, క్రీడాకారులు కంభంమెట్టు చెన్నకేశవ రావు91వ జన్మదినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు లయినెస్ భారత కమలాకర్ సీహెచ్ త్రినాథ రావు, శ్రీసాధన నరసింహచారి, లలితా పరమేశ్వరి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 20న ఉదయం పది గంటలకు త్యాగరాయ గానసభలో నిర్వహించనున్న కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర హైకోర్టు గౌరవ న్యాయమూర్తి చల్ల కోదండరాం ముఖ్యఅతిథిగా, రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జీఎల్‌ఇఎన్‌ఇఎజీఎల్‌ఈఎస్ గ్లోబల్ చైర్మన్ డా.ఎస్.ఆవులప్ప, త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సహస్ర పద్య కంఠీర చిక్కా రామదాసు విశిష్ట అతిథిగా, మంతెన కాలేజీ కమిటీ సెక్రటరీ కే.మారుతి, రిటైర్డు సైంటిస్టు డా.ఎస్‌ఎన్ గోల్లకోట, బరోడా బ్యాంకు మేనేజర్ రాజేశ్ ఆత్మీయ అతిథులుగా హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గురుడా శృతకీర్తి బృందంచే ‘సుషుమ్న’ నృత్యరూపక ప్రదర్శన కూడా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.