Others

తీరం దాటని పడవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలలను చీల్చుకుని మోసుకెళ్తున్న పడవ ఓ నీటి జ్ఞాపకం
మనం అలసిపోవాలే తప్ప పడవ అలసిపోదు
ఆకాశాన్ని నెత్తికెత్తుకున్న కొండలా
చెట్లను అమాంతం మోసుకెళ్తున్న నేలలా ఉంది పడవ

గోదావరి ఒడ్డునుండి పడవ బయలుదేరగానే
పడవలోని పర్యాటకులు చిన్న చిన్న అలల్లా
గాలిలో తేలిపోయారు
నీటికి, మనుషులకి మధ్య పడవ వంతెనయింది
ప్రకృతిలోకి పడవ వెళ్తుందో
పడవలోకి ప్రకృతి వచ్చిందో చెప్పలేం
అందాలను చూడాలంటే కళ్లను కెమెరాలు చేయాల్సిందే

పచ్చని చెట్లమధ్య కొండలున్నాయో
కొండల నిండా చెట్లున్నాయో తెలీదు గాని
ఒక్కోసారి మన కళ్లు మనల్నే మోసం చేస్తుంటాయి
నది పొడవునా పచ్చదనం అటూ ఇటూ పారుతున్నట్టు
మధ్యలో పడవ సాగిపోతోంది

నదిలోకి పడవ వెళ్తుందా?
పడవలోకి నది ప్రవహిస్తుందా?
చూసే మనసుకే తెలుస్తుంది
పడవ వేగాన్ని ఆటపట్టిస్తూ
పడవకు ఆ పక్క ఈ పక్క నీళ్లు చిమ్మినప్పుడు
ఆ నీటిని చేతుల్లోకి తీసుకుని
పర్యాటకులు సంబరపడిపోతున్నారు
‘చరవాణులు’ పడవ పక్కకు చేరి
ప్రకృతి అందాలు తమలోకి ఒంపుకుంటున్నాయి

చూసే కళ్లకి, పరుగెత్తే మనసుకి కాలంతో పనుండదు
ఆటలు, పాటలతో పడవ వినోద వేదికయింది
ఆడి పాడి అలసిపోయారేమో
లైఫ్ జాకెట్లు తీసి భోజనం మొదలుపెట్టారు
సరిగ్గా అప్పుడే వెన్నులోంచి భయం పొడ
సర్రున పాకింది ఎంత ఐరావతం లాంటి పడవైనా
నీటిలోని వడి వేగానికి తల ఒగ్గాల్సిందే
ఒకపక్క వడి వేగం, మరోపక్క ఇసుక మేట
పడవను ఎటు మళ్ళించాలో తెలియదు
సరంగు దిక్కులు చూసే లోపు
అనుకున్నదంతా జరిగిపోయింది

వడి వేగానికి బలైపోయిన పడవ
నీళ్లముందు ఓడిపోయింది
లైఫ్ జాకెట్లు అందుకునే లోపు
ఒక్కొక్కరు పిట్టల్లా నీళ్ళలోకి ఒరిగిపోయారు
జారిపోయిన వాళ్లంతా శవాలుగా తేలిపోయారు
ఏ శవం ఎక్కడ చేరిందో
జాడకోసం జల్లెడపట్టారు
ఇప్పుడు విషాదం ఆ నీళ్ళలోనే కాదు
తీరమంతా వ్యాపించింది

-చొక్కర తాతారావు 63011 92215