Others

విశ్వశ్రేయోకాంక్షాతత్వం మన కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ప్రపంచ కవితా దినోత్సవం
*
1999లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన యునెస్కో 30వ సదస్సులో మార్చి 21వ తేదీన ప్రపంచ కవితా దినోత్సవంగా పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. 2014నుండి ప్రతి సంవత్సరం మార్చి 21న యునెస్కో ప్రపంచ కవితా దినోత్సవంగా ప్రకటించింది. భాషా భిన్నత్వాలను, కవితా ప్రసారం ద్వారా ఏకం చేసేందుకు, అంతరించిపోతున్న భాషలను తిరిగి కాపాడడం, ప్రపంచవ్యాప్తంగా కవితా రచన, పఠనం, ప్రచురణ, బోధనా వ్యాసంగాన్ని చైతన్యవంతం చేయడం, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కవిత్వ ఉద్యమాల స్ఫూర్తిని పదిలపరచడం, ఆశువుగా కవిత్వాన్ని చెప్పే కళాసంస్కృతిని ప్రోత్సహించి చిత్రకళలతో కవిత్వానికిగల సంవాదాన్ని పెంచడం, ప్రసార మాధ్యమాలలో కవిత్వానికి అత్యున్నత స్థాయిని కల్పించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.
మానవ జీవితాన్ని శుభప్రదం, సుఖప్రదం, జయప్రదం చేయడంలో అత్యంత కీలకంగా ఉపయోగపడ్డాయి భారతీయ కళలు 64. అందు ఏడవది కవిత్వం. విశ్వశ్రేయోకాంక్షాతత్వం మన కవిత్వం. ఇది గతిబద్ధం, యతిబద్ధం, శృతిబద్ధం. అందుకే ఈనాటికీ మన కవిత్వం విశ్వసాహితీ వేదికపైన అనన్యసామాన్యంగా వెలుగొందుతున్నది. కవిత్వంయొక్క పరమ ప్రయోజనం లోకకళ్యాణం. వాల్మీకి రామాయణం, వ్యాసుని భారతం, ఋషుల వేదాలు, పురాణాలు, ప్రబంధాలు ఇదే విషయాన్ని చెబుతూ వచ్చాయి. సంగీతములో ఆవిష్కరింపలేనిది కూడా కవిత్వంలో నిరూపించవచ్చు.
కవిత్వం రాజస్థానాలనుండి, ప్రభుత్వ ఆస్థానాలనుంచి, పీఠాలనుంచి ఆధిపత్య భావజాలం నుంచి, బాజాభజంత్రీలనుంచి బయటపడి పల్లెలలోకి, మట్టిమనుషులలోకి, నేలతల్లి చెమటచుక్కలలోకి ప్రవేశించి చాలాకాలమైపోయింది. తరతరాల బానిసత్వాన్ని వదుల్చుకున్న అసలు సిసలైన గొంతుల్లో కవిత్వం పరవళ్ళు తొక్కుతుంది. భారతీయ కవిత్వం ప్రధానంగా పద్య కవిత, గేయ కవిత అని రెండు విభాగాలు. పద్యం ఛందోబద్ధమైనది. ఇది గణ, యతి, ప్రాస, అక్షర, మాత్రానియతిని కలిగి నిర్దిష్టమైన, నిర్దుష్టమైన నడకతో నడుస్తుంది. పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో మన దేశంలోని అన్ని భాషలలోను విస్తరించిన కవితాశాఖ వచన కవిత్వం. 20వ శతాబ్దంలో ఇది భారతీయ సాహిత్యాన్ని కుదుపుకుదిపి విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికింది. తదనంతర కాలంలో వస్తువును అనుసరించి అనేక శాఖోపశాఖలు ఏర్పడ్డాయి. విప్లవ కవిత, భావకవిత, దళిత కవిత, స్ర్తివాద కవిత, వినోద కవిత, దిగంబర కవిత మొదలగునవి. కవితా లక్షణాలను అనుసరించి మినీ కవిత, నానీ, హైకూ, రుబాయిలు, నోనాలు, రెక్కలు మొదలైన పద్ధతులు ఈ కవితాశాఖను పుష్టిగామార్చి ఆధునిక జీవితాన్ని ఆలోచనాయుతం, ఆనందమయం చేయడంలో దోహదపడుతున్నాయి.
ఇవాళ కేవలం తెలుగు పాఠ్యాంశంగా చదివినవారేగాక ఇంజనీర్లు, డాక్టర్లు, ఐటి ప్రొఫెషనల్స్, వివిధ శాఖల ఉద్యోగులు కవితలు వ్రాస్తున్నారు. ఫేస్‌బుక్‌లో, అంతర్జాల పత్రికలలో, వెబ్ గ్రూపులలో, వివిధ పత్రికలలో వస్తున్న కవితలను చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎందరో కొత్త కవులు, కవయిత్రులు అద్భుతంగా కవితలు వ్రాస్తున్నారు. అయితే చాలామంది కవితా నిర్మాణంపట్ల జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది.
వచన కవితలు రాయాలనుకునేవారు కవితా సంపుటాలను బాగాచదవాలి. సరైన పదాలు సరైన క్రమంలో ఉండాలి. భాషాశాస్త్రం చదవకపోయినా కనీసం సీనియర్ కవుల కవిత్వభాషను పరిశీలించాలి. కొత్తగా ఆలోచించాలి, కొత్తగా ఊహించడంలోనే కవుల గొప్పతనం బయటపడుతుంది. కవిత్వం గిజిగాడు గూడు అల్లినట్లు ఉండాలి. భాష సరళంగా ఉండాలి. అనుభూతికి లోనై కవితలు వ్రాయాలి. కవిత్వంలో చెప్పేదేమైనా బలంగా చెప్పాలి.
ఓ కవి సూర్యుడా! కవిత్వంకోసం కలవరించు.
బతుకు పొయ్యిపై హృదయ పాత్రలో కావ్యరసం వండు.
కవిత్వము నీ గుండెలో ఎగసిపడే అక్షర సైన్యం.
కవిత్వం-
సాహిత్యానికి మకుటం.
ఆధునిక సమాజానికి ప్రతిబింబం.
పదాల్లోంచి ప్రపంచంలోకి విడుదలకావడం.
సకల కళలకు ఆధారం. సూక్ష్మాలను మాటల్లో చెప్పడం.
సౌందర్యాన్ని ఆరాధించడం.
మేధావుల మనసులను కదిలించేది.
జాతికి నీతిని నేర్పేది.
సరిహద్దు రక్షణ
నీతిని ప్రోత్సహించేది.
అవినీతిని ఖండించేది.
ధర్మాన్ని ప్రబోధించేది.
చీకటిలో మ్రగ్గుతున్న ప్రజలకు దారిచూపేది
జాతికి జీవనాడి.
ఆవేశం అవధులు దాటితే
ఆనందంలో తేలినా.. దుఃఖములో మునిగినా
కవిత్వమే
కవిత్వము కారాదు కొరుకుపడని విత్తనము.
విన్నంతనే ఎద పొంగాలి.
కవిత్వమంటే అక్షర హింస కాదు,
కవిత్వమంటే అక్షర తాండవం.
ఆధునిక సంక్షోభ జీవన సమరములో
కవిత్వం మనసుకు ఓ పెద్ద ఊరట.
కవిత్వం బతుకుకు బాసట, ఒక భరోసా.
అందుకే వంటను ప్రేమతో చెయ్యాలి,
కవిత్వాన్ని దీక్షతో రాయాలి.

- సాయిబాబు, వీరవాసరం