Others

సక్రమ నీటి వినియోగమే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ప్రపంచ జల దినోత్సవం
*
మన విశ్వం ఒక పెద్ద విస్ఫోటనం వలన ఏర్పడిందని, దాని ఫలితంగానే పంచభూతాలు ఆవిర్భవించాయని, నేల, నీరు, ఆకాశంలోని గ్రహరాశులు, నక్షత్రాలు ఈ మహావిస్ఫోటనం వలనే ఏర్పడినట్టు శాస్తవ్రేత్తలు చెబుతుంటారు. బిగ్ బ్యాంగ్ థియేటర్‌ని దీనికొక ఉదాహరణగా పేర్కొంటారు. విశ్వంయొక్క పుట్టుక ఎలా ఉన్నప్పటికీ ఈ సృష్టిలో సకల చరాచర జీవరాశుల మనుగడ మాత్రం నీటిపై ఆధారపడి ఉన్నది. జలం లేనిదే జనం లేరు. ప్రాణికోటి మనుగడకు జలం అత్యంత ఆవశ్యకం. మానవ శరీరం సుమారు 70శాతం నీటితో నిండి ఉంటుంది. అలాంటి ప్రాధాన్యతగల ప్రాణాధారమైన నీరే కరువైతే మానవాళి మనుగడ లేనే లేదు. ఇప్పటికే ఈ సుందరమైన భూగ్రహం మానవ తప్పిదాలతో విధ్వంసమైపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. వాతావరణ మార్పులతో, కాలుష్య కారకాలతో మానవ జీవనం అల్లకల్లోల సాగరంలా మారిపోయింది. యుద్ధాలతో, అశాంతితో, ఆకలితో, అధిక జనాభాతో, రోగాలతో, ప్రకృతి బీభత్సాలతో మానవ మనుగడ అత్యంత సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో ప్రాణాధారమైన నీరు కూడా సకల దుర్గంధాలతో నిండిపోవడం, భవిష్యత్తులో నీరే కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించడం మానవ కల్పితమే. ముమ్మాటికీ మానవ తప్పిదమే అని చెప్పక తప్పదు. 7.8 బిలియన్లుగల ప్రస్తుత ప్రపంచ జనాభా మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెరిగిన జనాభాతోపాటు వారి అవసరాలకు సరిపడా వనరులను పెంచలేము. జనాభా పెరుగుదల ఫలితంగా ప్రకృతిని విధ్వంసం చేయవలసి వస్తున్నది. సహజవనరులు తరిగాయి. నీటి అవసరాలు పెరిగాయి. నీటి శాతం తరిగింది. 2040నాటికి నీటికోసం దారుణమైన పోరాటాలు జరిగే అవకాశం ఉంది. నీటి లభ్యత మృగ్యమై మరికొద్ది దశాబ్దాల్లో మానవ మనుగడ కడుదుర్లభంగా మారే అవకాశాలున్నాయి. 2050నాటికి నీటి లభ్యత లేక స్నానాలు మాని, రసాయన లేపనాలతో జీవించవలసి వస్తుందని మన క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం ఏనాడో హెచ్చరించాడు.
మొత్తం జల సంపదలో ఒకవంతు మాత్రమే నేలపైన, మూడొంతులు సముద్రాల్లో నిండి ఉండడంవలన, సముద్ర జలం ఉప్పుతో కూడుకుని వ్యర్థంగా మారిన దశలో మనకు లభ్యమయ్యే 2.5 శాతం నీటి వనరులతోనే అవసరాలు తీర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
నీటి కొరత, నీటి కాలుష్యం, పారిశుద్ధ్య లోపాలవలన అనేక అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఇప్పటికీ మన దేశంలో 60 మిలియన్ల మందికి పైగా ప్రజలు సరైన నీరులేక బాధపడుతున్నారు. అందుబాటులో ఉన్న నీరు కలుషితాలతో నిండి వ్యాధులను వ్యాపింపచేయడం పుండుపై కారం చల్లడమే. ఇప్పటికీ భారతదేశంలో 53శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి బ్రతుకుతున్నారు. వ్యవసాయానికి సరిపడా నీరు అందించలేక పంటల విస్తీర్ణంతగ్గి దేశ ఆర్థిక పరిస్థితి మందగించడం కూడా సహజమే. ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు రాబోయే రోజుల్లో తీవ్రమైన నీటికొరతను ఎదుర్కోవలసి వస్తుంది. నాణ్యతాపరమైన త్రాగునీటి వినియోగంలో కూడా భారత్ వెనుకబడే ఉంది. అంతర్జాతీయ సంస్థలు జరిపిన సర్వే గణాంకాలనుబట్టి నీటి నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా ప్రపంచంలోని 122 దేశాలలో 120వ స్థానం భారతదేశానిది.
కలుషితమైన నీటి వినియోగంవలన నీటిలో ఈ-కొలి బ్యాక్టీరియా చేరి మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఆహారం విషతుల్యంగా మారుతున్నది. కలరా, టైఫాయిడ్, డయేరియా లాంటి రోగాలకు అపరిశుభ్రమైన నీటి వినియోగమే కారణం. భారతదేశంలో ప్రజలకు సరఫరా కాబడే నీటిలో 70 శాతం ప్రమాదకరమైన కలుషితాలతో నిండి ఉన్నట్టు ఒక అంచనా. ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో 3.1 శాతం మరణాలకు నీటి నాణ్యతా లోపమే కారణమని పేర్కొనడ గమనార్హం.
పరిమితమైన వనరుల వలన ప్రపంచంలోని పేద దేశాలు భవిష్యత్తులో నీటి సమస్యతో సతమతమయ్యే సూచనలు కానవస్తున్నాయి. భవిష్యత్తులో నీటి అవసరాలు మరింత పెరగనున్న దృష్ట్యా, నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. 1992వ సంవత్సరంలో ఐ.రా.స. బ్రెజిల్‌లో రియోడిజెనీరో నిర్వహించిన ఒక సదస్సులో నీటి ఆవశ్యకత గుర్తించి ఒక తీర్మానం ఆమోదించింది. 1993 మార్చి 22వ తేదీన ప్రప్రథమంగా ప్రపంచ జలదినోత్సవం (వరల్డ్ వాటర్ డే) జరిగింది. అప్పటి నుండి ప్రతీ సంవత్సరం మార్చి 22వ తేదీన ప్రపంచ దేశాలన్నీ జల దినోత్సవంగా పాటిస్తున్నాయి. 2030 సంవత్సరంనాటికి అందరికీ పరిశుభ్రమైన నీరు అందించడమే ధ్యేయంగా ప్రారంభమైన ప్రపంచ జల దినోత్సవం ఈ ఏడాది ‘నీటి ఆవశ్యకత-వాతావరణ మార్పులు’అనే థీమ్‌ను ఎంచుకుని మనముందుకు రాబోతున్నది. ప్రజలకు స్వచ్ఛమైన జలాన్ని అందించడం, నీటి వినియోగాన్ని తగ్గించుకోవడం, వృథాగా కడలిలో కలుస్తున్న నీటిని ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా వినియోగంలోకి తీసుకురావడం మనముందున్న తక్షణ కర్తవ్యం. వ్యవసాయంలో శాస్ర్తియ దృక్పథం పెంచుకుని, బిందుసేద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలి. ప్రజలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏమీలేదు. ఎడారి రాష్టమ్రైన రాజస్థాన్‌లో ప్రజలంతా సంఘటితమై వ్యవసాయ క్షేత్రాల్లో కుంటలను తవ్వి భూగర్భ సంపదను పెంచడం అందరికీ ఆదర్శప్రాయం కావాలి. కనుమరుగవుతున్న నాగానది సంరక్షణలో భాగంగా తమిళ ప్రజలు బావులుతవ్వి వర్షపునీటిని వృథాగాపోకుండా చేసి, భూగర్భ జలాలను పెంచి నాగానదిని పునర్జీవింప చేయడం ప్రశంసనీయం. ప్రతి ఒక్కరూ రాబోయే తరాలను దృష్టియందుంచుకుని, నీటి ఆవశ్యకత గురించి వివరించాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఇంకుడు గుంతలు, వాటర్ హార్వెస్టింగ్ వంటి పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వాలు నీటి కొరతకు పరిష్కారమార్గాలు చూపాలి. ప్రపంచ దేశాలన్నీ తగు విధివిధానాలతో నీటికొరతను నిర్మూలించాలి. వివక్షతకు తావులేకుండా అందరికీ స్వచ్ఛజలం అందించాలి. ఆనాడే నిజమైన జల దినోత్సవం.
*

- సుంకవల్లి సత్తిరాజు, 9494703463