క్రైమ్/లీగల్

హోంగార్డు కుటుంబం అదృశ్య మిస్టరీ సుఖాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, సెప్టెంబర్ 23: ఇటు పోలీసుశాఖలో, అటు కుటుంబ సభ్యులు, ప్రజల్లో ఉత్కంఠత కలిగించిన హోంగార్డు కటకం రవితో పాటు ఆయన కుటుంబం అదృశ్యం కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. రవితోపాటు భార్య పద్మ, కూతుళ్లు సింధు, స్పందన శనివారం ఉదయం అదృశ్యమైన విషయం తెలిసిందే. అయితే సంఘటనని ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు కేవలం 15 గంటల వ్యవధిలోనే దీనిని ఛేదించడం విశేషం. రవితోపాటు కుటుంబ సభ్యులు విజయవాడలోనే క్షేమంగా ఉన్నట్టు తెలియడంతో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని తమ అదుపులోకి తీసుకొని తుంగతుర్తికి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తుంగతుర్తి ఎస్‌ఐ శ్రీకాంత్ సోమవారం సాయంత్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. మొదటి కుమార్తె చందన (వివాహిత) మృతిచెందిన తరువాత హోంగార్డు రవి మానసికంగా కుంగిపోయారు. అంతేగాకుండా ఈ సంఘటనపై వివిధ రకాలుగా ప్రచారం జరిగింది. దీంతో మనస్థాపం చెంది ఇక్కడ ఉండకూడదనే ఉద్దేశంతో భార్య, పిల్లలను తీసుకొని అదృశ్యమయ్యారు. ఈమేరకు పోలీసు టీంలు వివిధ ప్రాంతాలలో గాలింపు చేపట్టాయి. అయితే రవి కుటుంబం అదృశ్యమయ్యే ముందు సెల్ ద్వారా సిగ్నల్స్ స్థానిక తహశీల్దార్ కార్యాలయం వరకు మాత్రమే పనిచేసి చివరికి సెల్ స్విచ్ఛ్ఫాతో మూగపోయింది. కాగా పోలీసులకు తరువాత వాడపల్లి తదితర ప్రాంతాలలో రవి సమాచార సిగ్నల్స్ రావడాన్ని గమనించారు. కాగా ఆదివారం రాత్రి రవి కుమార్తె సెల్‌ని ఆన్ చేయడంతో విజయవాడ కనక దుర్గమ్మ గుడి ప్రాంతంలో ఉన్నట్టు తెలిసిందని ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు మద్దిరాల ఎస్‌ఐ రంజిత్‌తో పాటు సిబ్బంది అక్కడికి వెళ్లి రవి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అనంతరం వారిని తుంగతుర్తికి తీసుకొచ్చి రవి తల్లిదండ్రులు కటకం పోతులూరి, ఈశ్వరమ్మలకు అప్పగించినట్టు ఆయన వివరించారు.