క్రైమ్/లీగల్
బీర్ బాటిళ్లతో ఎంపీపీపై దాడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వికారాబాద్, ఆగస్టు 18: కోటపల్లి ఎంపీపీ నల్లొల్ల శ్రీనివాస్‌రెడ్డిపై బీర్ బాటిళ్లతో దాడి చేసిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..కోటపల్లి ఎంపీపీ నలొల్ల శ్రీనివాస్‌రెడ్డి స్వగ్రామమైన రాంపూర్ గ్రామానికి చెందిన చేకూరి శ్రీనివాస్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, జగన్రెడ్డిలతో కలిసి శనివారం రాత్రి కోటపల్లి పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న ఓ ఫర్టిలైజర్ దుకాణంలో కూచొని మద్యం తాగారు. అంతలోనే చేకూరి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీప నల్లొల్ల శ్రీనివాస్‌రెడ్డి మద్య మాట..మాట పెరిగింది. దీంతో చేకూరి శ్రీనివాస్‌రెడ్డి ఎంపీపీ నల్లొల్ల శ్రీనివాస్‌రెడ్డిని బీరు బాటిల్‌తో దాడీ చేశాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అతని మిత్రులు ప్రతాప్‌రెడ్డి, జగన్‌రెడ్డి తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వైద్యులు చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం నగరంలోని దక్కన్ ఆసుపత్రికి తరలించారు. ఎంపీపీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ సునితారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఎంపీపీని పరామర్శించారు. ఎంపీపీ భార్య లలిత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.