క్రైమ్/లీగల్

ఇవేనా సవాల్ పిటిషన్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యంత తీవ్రమైన ఈ అంశంపై దాఖలైన సవాళ్ల పిటిషన్లలో ఎన్నో లోపాలు ఉన్నాయని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. మొత్తం ఈ అంశంపై ఆరు పిటిషన్లు దాఖలయ్యాయని, వీటిలో ఏది కూడా సవ్యంగా లేదని పేర్కొన్న సుప్రీంకోర్టు తొలి పిటిషనర్ లాయర్ ఎం.ఎల్.శర్మను మందలించింది. ఈ పిటిషన్‌లో ఎలాంటి అర్థం లేదని పేర్కొన్న ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ‘దాదాపు అరగంటపాటు ఈ పిటిషన్‌ను చదివాను. కానీ నాకేమీ అర్థం కాలేదు.
అసలు పిటిషనర్ ఏమి చెప్పదలచుకున్నారో కూడా స్పష్టం కాలేదు’ అని వ్యాఖ్యానించారు. అసలు అది ఏ రకమైన పిటిషనో కూడా తెలియడం లేదని పేర్కొన్న ఆయన వాస్తవానికి దీనిని కొట్టివేసి ఉండవచ్చుగానీ దీంతో పాటు మరో ఐదు పిటిషన్లు కూడా రిజిస్ట్రీలో నమోదై ఉన్నాయని తెలిపారు. ఈ కేసును విచారించిన ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎస్‌ఏ బాబ్డే, ఎస్‌ఏ నజీర్ కూడా ఉన్నారు. ‘రాజ్యాంగంలోని 370 అధికరణను తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని మీరు కోరుతున్నారు. కానీ రాష్టప్రతి ఉత్తర్వును కొట్టివేయమని కోరడం లేదు. అసలు ఈ అభ్యర్థన ఉద్దేశం ఏమిటో కూడా స్పష్టం కావడంలేదు. దీనిని సాంకేతిక కారణాలతో కొట్టివేసేందుకు ఎంతైనా ఆస్కారం ఉంది’ అని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. అత్యంత కీలకమైన స్వభావం కలిగిన ఈ అంశంపై సరైన పిటిషన్ దాఖలు చేయకపోతే దానికి ఎలాంటి అర్థమూ ఉండదని తెలిపింది. మొత్తం ఆరు పిటిషన్లలో ఉన్న లోపాలను తొలగించాలని సదరు న్యాయవాదులను కోరిన సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ రిట్ పిటిషన్‌ను సవరించడానికి అనుమతి కావాలని కోర్టుకు వ్యతిగతంగా హాజరైన పిటిషనర్ కోరారు. దీనికి కోర్టు అనుమతించింది. ఇంత లోపభూయిష్టంగా ఉన్న పిటిషన్లతోపాటు విచారణ నిమిత్తం కోర్టు దీనికి జత చేసింది. ఈ లోపాలను తొలగించిన తర్వాత వీటిని తమకు నివేదించాలని రిజిస్ట్రీని బెంచ్ ఆదేశించింది. విచారణ సందర్భంగా మాట్లాడిన న్యాయవాది షకీల్ షబీర్ తాను జమ్మూకాశ్మీర్ నివాసినని, 370 అధికరణ రద్దుకు వ్యతిరేకంగాను, జమ్మూకాశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశానన్నారు. తన పిటిషన్‌లో లోపాలను తొలగించినప్పటికీ దానిని విచారణకు లిస్టులో పెట్టలేదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని రిజిస్ట్రీతో వాకబు చేసిన ధర్మాసనం కేవలం బుధవారమే ఈ లోపాలను తొలగించిన విషయాన్ని స్పష్టం చేసింది. పైగా, గురువారం ఆగస్టు 15 సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు కూడా వచ్చిందని, అలాంటపుడు ఈ పిటిషన్‌ను శుక్రవారమే విచారణ చేపడతారని ఎలా అనుకుంటారని ఆ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. అంతేకాదు, అత్యంత కీలకమైన ఈ అంశంపై అర్థం పర్థంలేని పిటిషన్‌ను ఎలా దాఖలు చేస్తారని కోర్టు మండిపడింది.