అంతర్జాతీయం

‘సంఝోతా’కు హాల్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: సంఝోతా ఎక్స్‌ప్రెస్ రైలుకు పాకిస్తాన్ బ్రేక్ వేసింది. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్డికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై గుర్రుగా ఉన్న పాకిస్తాన్ గురువారం వాఘా సరిహద్దు వద్ద సంఝోతా ఎక్స్‌ప్రెన్‌ను అడ్డుకొని, వెనక్కు పంపింది. భద్రతాపరమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే భారత అధికారులు వాఘా బార్డర్‌కు వెళ్లి, ప్రయాణులు, రైలు సిబ్బందిని జాగ్రత్తగా అతారీకి తరలించారు. భద్రతా కారణలను ఉటంకిస్తున్నప్పటికీ, కాశ్మీర్‌పై మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతున్నదన్నది వాస్తవం. అందుకే, బుధవారం ఇస్లామాబాద్‌లో భారత రాయబారిని బహిష్కరించింది. గురువారం సంఝోతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేసి, పరోక్షంగా తన ఆగ్రహాన్ని భారత్‌కు తెలిపింది.