28న వస్తున్నాడు.. కల్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజశేఖర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం -కల్కి. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై నిర్మాత సి కళ్యాణ్ నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధమవుతున్న చిత్రాన్ని జూన్ 28న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ -కల్కి టీజర్, ట్రైలర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. పక్కా కమర్షియల్ సినిమా ఇది. త్వరలోనే ఆడియో విడుదల చేసి, ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రావణ్ భరద్వాజ్ అద్భుతమైన బాణీలు, మంచి నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా అన్ని వర్గాలను ఎంటర్‌టైన్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నాం’ అన్నారు. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ ‘డిఫరెంట్ మాస్ ఎంటర్‌టైనర్ కల్కి. సినిమా ట్రైలర్ సోషల్ మీడియా, యూట్యూబ్‌లో టాప్ ట్రెండ్‌లో ఉంది. రాజశేఖర్ ఇమేజ్‌కు తగిన విధంగా కమర్షియల్ ట్రెండ్ ప్రాజెక్టును ప్రశాంత్‌వర్మ తెరకెక్కించాడు’ అన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘ఇండో-పాక్’ క్రికెట్ మ్యాచ్ మాదిరి కల్కి కూడా ఆడియన్స్‌ని ఉత్కంఠకు గురి చేయడం ఖాయం. త్వరలోనే థియేట్రికల్ టైలర్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సినిమా అద్భుతంగా రావడం వెనుక నిర్మాత సి కళ్యాణ్ సహకారం మర్చిపోలేం’ అన్నారు. ఆదా శర్మ, నందితా శే్వత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్దూ జొన్నలగడ్డ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.