క్రైమ్/లీగల్

అక్రమంగా జీడిపప్పు విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 1: బిల్లులు లేకుండా జీడిపప్పును మార్కెట్‌లో అక్రమంగా విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.10లక్షలు విలువైన 1400 కిలోల జీడీపప్పు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామంలో స్థానిక రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన జీడిపప్పును బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అక్రమంగా నగరానికి తీసుకొచ్చిన ఆరుగురు వ్యక్తులు మార్కెట్‌లో విక్రయించేందుకు యత్నించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కుంపట్ల వీర వెంకట సత్య శ్రీనివాస్ (35), ఆచంట శ్రీనివాసరావు (43), పోతురాజు రాంబాబు (50), వలవల యుగంధర్ (32), పోతురాజు నాగసూర్య వీరవెంకట సత్యనారాయణమూర్తి (38), ఏడిద సత్యనారాయణ (56) అనే ఆరుగురితోపాటు మరో నలుగురు వ్యక్తులు కలిసి అక్కడ స్థానిక రైతుల వద్ద జీడిపప్పును అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. మొత్తం 1400 కిలోల జీడిపప్పుకు సగానికి మాత్రమే వే బిల్లులు తీసుకుని మొత్తం సరుకును రెండు బొలేరో వాహనాల్లో నగరానికి తీసుకువచ్చారు. దీంతో సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఏసీపీ జీ రాజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి విక్రయానికి యత్నిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి వాహనాలతో పాటు రూ.10 లక్షల విలువైన జీడిపప్పును స్వాధీనం చేసుకుని నిందితులతో సహా కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.