క్రైమ్/లీగల్

దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, ఆగస్టు 31: పట్టణంలో భార్యాభర్తలు సంతానం కలగలేదని చుట్టుపక్కలవారి సూటిపోటు మాటలతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం జరిగింది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్టీల్ ప్లాంట్‌లో ఏపీఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేసే ప్రసాద్ (41), భార్య లక్ష్మీసరస్వతి శుక్రవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంతానం కలగలేదనే మనస్తాపం, బయటవారి మాటలకు లక్ష్మీసరస్వతి ఆత్మహత్యకు పాల్పడగా భార్య చనిపోవడంతో ప్రసాద్ కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా లక్ష్మీసరస్వతి ఒక ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుండగా అక్కడి వారి వేధింపులు ఆత్మహత్యకు కారణంగా తెలుస్తున్నాయి. ఈ మేరకు ఒక సూసైడ్ నోట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఐ శ్రీహరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.