క్రైమ్/లీగల్
రేవులో పడి వృద్ధుడు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 August 2018
చల్లపల్లి, ఆగస్టు 27: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు రేవులో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఆముదార్లంకలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన కళ్లేపల్లి శివాజి (68) పంచాయతీలో పని చేస్తూ ఉదయానే్న వాటర్ వదిలేందుకు పంప్ హౌస్కు వెళ్లి ఆ తరువాత బహిర్భూమికి వెళ్లి రేవులో జారి పడ్డాడు. నదిలో వరద నీరు ఎక్కువగా ఉండటంతో నీట మునిగి మృతి చెందాడు. కొద్ది దూరంలో ఉన్న స్థానికులు శివాజి నీట మునగటాన్ని గమించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీఆర్ఓ కె వెంకటేశ్వరరావు పంచనామా నిర్వహించగా ఎఎస్ఐ ఎన్వి సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.