క్రైమ్/లీగల్
యువకుడి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 27 August 2018
నందికొట్కూరు, ఆగస్టు 27:పట్టణంలోని బైరెడ్డి శేషశయనారెడ్డి నగర్ కాలనీలో నివసిస్తున్న షేక్ చాంద్‌బాషా(22) సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నతనంలోనే తండ్రి బండిబాబు మృతి చెందడంతో తల్లి ఉసేన్‌బీ కొడుకును పెంచి పెద్ద చేసింది. కాగా సెంట్రింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న షేక్ చాంద్‌బాషా ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడో కారణాలు తెలియాల్సి వుంది. కడుపునొప్పి తాళలేక జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు.