క్రైమ్/లీగల్
ఇస్మాయిల్బేగ్పేటలో విషాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కోడూరు, ఆగస్టు 25: కోడూరు మండలం ఇస్మాయిల్బేగ్ పేటకు చెందిన రామచంద్రపురం ఎస్ఐ కోట వంశీధర్ (33) ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద జరిగిన కారు ప్రమాదంలో పంట కాలువలో కొట్టుకుపోయిన ఘటనతో ఆయన స్వగ్రామమైన ఇస్మాయిల్బేగ్పేటలో విషాదాన్ని నింపింది. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న ఎస్ఐ కారు ప్రమాదానికి గురై పంట కాలువలో గల్లంతు కావటం ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా కలచి వేసింది. ఇస్మాయిల్బేగ్ పేటకు చెందిన కోట హరిప్రసాద్-లక్ష్మి దంపతులకు ఇరువురు కుమారులు కాగా పెద్ద కొడుకు విజయనగరం డీఎస్పీగా పని చేస్తున్నాడు. రెండవ కొడుకు వంశీధర్ రామచంద్రపురం ఎస్ఐగా పని చేస్తున్నాడు. విలువిద్య క్రీడాకారుడైన వంశీధర్ పట్టుదలతో సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సాధించి జీవితంలో అంచలంచెలుగా ఎదిగిన విధానాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.