క్రైమ్/లీగల్
ఎస్ఆర్బీసీ కాలువలో పడి వృద్ధుడి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 16 August 2018
బనగానపల్లె, ఆగస్టు 16:మండల పరిధిలోని చిన్నరాజుపాలెం గ్రామానికి చెందిన మహమ్మద్‌గౌస్(70) గురువారం ఉదయం ప్రమాదవశాత్తూ ఎస్ఆర్బీసీ కాలువలో పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చిన్నరాజుపాలెం గ్రామం నుంచి వచ్చిన మహ్మద్‌గౌస్ బనగానపల్లె సమీపంలో ఎస్ఆర్బీసీ కాలువ కట్టపై బహిర్భూమికి వెళ్లి నీటిలోకి పడిపోయాడు. ఇది గమనించిన పరిసర ప్రాంతంలో వున్న ప్రజలు అతడిని నీటిలో నుంచి బయటకు తీసుకొచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందడంతో పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.