క్రైమ్/లీగల్

ఇష్టమొచ్చినట్టు మీడియాతో మాట్లాడితే జైలుకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అసోంలో ప్రజల పౌరసత్వాన్ని నిర్ధారించేందుకు నిర్వహించిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) ప్రక్రియపై ఎన్‌ఆర్‌సి కో-ఆర్డినేటర్, రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జిఐ) తమ ఇష్టం వచ్చినట్టు మీడియాకు ప్రకటనలు చేయడాన్ని సుప్రీం తీవ్రంగా తప్పుపట్టింది. తమ అనుమతి లేకుండా ఇకముందు ఇష్టం వచ్చినట్టు మీడియాతో మాట్లాడితే కోర్టు ధిక్కరణ కింద జైలుకు పంపాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎన్‌ఆర్‌సీలో చోటుదక్కని వారి నుంచి వచ్చే అభ్యంతరాలు, క్లయిమ్‌లకు సంబంధించి సంబంధించి కో-ఆర్డినేటర్ ప్రతీక్ హజేలా, ఆర్‌జిఐ శైలేష్ మీడియాకు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు ఇవ్వడాన్ని జస్టిస్‌లు రంజన్ గోయల్, ఆర్‌ఎప్ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం ఆక్షేపించింది. బాధితుల నుంచి అభ్యంతరాలు, క్లయిమ్‌లకు సంబంధించి మీడియాలో మీరు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తున్నారు, అసలు దీంతో మీకు సంబంధం ఏమిటి? అని కోర్టు ప్రశ్నించింది. మీరు కోర్టుకు సంబంధించిన అధికారులన్న విషయాన్ని మరవొద్దు, మేము నిర్దేశించిన మార్గదర్శకాల మేర కు మీకు ఇచ్చిన పనిని పూర్తి చేయడం వరకే మీ బాధ్యత అని కోర్టు వ్యాఖ్యానించింది. మా అనుమతి లేకుండా మీరు ఇలా మీడియాకు ఎలా ప్రకటనలు ఇస్తారని హెచ్చరించింది. దాం తో వారిద్దరూ కోర్టుకు బేషరతు క్షమాపణ చెప్పారు. ఎన్‌ఆర్‌సిపై వస్తున్న అభ్యంతరాలు, విన్నపాలను పరిశీలించడానికి కేంద్రం ఒక ప్రామాణిక ప్రక్రియ పద్ధతిని ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ కేసును ఈ నెల 16కు వాయిదా వేసింది.