డైలీ సీరియల్
యాజ్ఞసేని -- 103
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘ఓ యాజ్ఞసేనీ! ఇంత ప్రొద్దుపోయిన తరువాత యిట్లెందుకొచ్చావు? ఏమి కారణము? ఎవరూ చూడలేదుగదా?’’ అని అన్నాడు.
‘‘ఓ భీమసేనా! తెలిసి తెలిసి ననె్నందుకడుగుతున్నావు? ఇంతలోనే మరచిన నీకునేను చెప్పవలసిన అవసరమేమున్నది? నీవు విననవసరం లేదు. అలాగాక నానోటి నుంచే వినాలని వుంటే సరే! చెపుతాను
ఆ నీచ కీచకుడు, విరాటుని బావమరిది అక్క సుదేష్ణాదేవిని చూచి మ్రొక్కటానికై వచ్చి నన్ను మదనావేశంతో చూస్తూ యెన్నోరకాలుగా మాట్లాడి, నన్ను సమీపించగా అతడిని విదిలించినట్లుగా మాట్లాడాడు. అయినా వాడు మత్తెక్కిన మదనావేశంతో నన్ను కామంతో కోరాడు. అంతేగాక యెన్నో రకాలుగా వదురుబోతు మాటలను మాట్లాడాడు. నేను సమయోచితంగా సమాధానం చెప్పి వాడిని త్రోసిపుచ్చాను.
వాడు మరలిపోయాడు. ఆ తరువాత ఆ పాపాత్మురాలైన ఆ సుదేష్ణ నన్ను మదిర తెమ్మని కీచకుడి యింటికి పొమ్మని ఆజ్ఞాపించింది. నేను వలదని వారించినా ఆమె వినలేదు. నేనెన్నో కారణాలు చెప్పినా అన్నింటికి అడ్డం చెప్పి బలవంతపెట్టింది. ఘర్షణ పడటం బాగుండదని తలంచి నా మనసులో మీ బలసంపన్నతపై విశ్వాసంతో ననె్నవరేమీ చేయలేరని ఆ నీచుని యింటికి వెళ్ళాను. కానీ వాడు యేవేవో ప్రేలాపాలు చేసి చివరకు నా చేయి పట్టుకొనబోగా వాడిని తొలగద్రోసి పోసాగాను. వాడు నన్ను వెంబడించగా నేనప్పుడు మీరున్న చోటికి వచ్చాను.
ఆ కులభ్రష్ఠుడైన కీచకుడు నన్ను వెంబడించి వచ్చి పట్టుకొన్నాడు. తరువాత యేమి జరిగిందో నీకు తెలుసు. మీ అన్న ధర్మరాజు చూపిన పెద్దతనం గూడా చూచావు. ఆనాడు ధృతరాష్ట్రుడి కొలువులో దుశ్శాసనుడు నన్నవమానించాడు. సైంధవుడు నిర్భయంగా నన్నట్లా తీసికొనిపోయి అనుచితం చేసినా చెల్లిపోయింది. ఈనాడు విరటుని కొలువులో సభాసదులందరూ చూస్తుండగా వీకు ఈ విధంగా చేశాడు. అయినా మిమ్ములను కొని యేమి ప్రయోజనం. దుఃఖించటం నాకీనాడు క్రొత్తగాదు. అల్లాంటి కీచకుడు నన్ను తన్నగా చూచి ధర్మరాజు చూస్తు యెట్లా వుండిపోయాడు’’ అని అన్నది ద్రౌపది.
ద్రౌపదీ! ఆ విధంగా నిన్ను పరాభవించటం చూచి కోపావేశంతో ఒడలు తెలియని నన్ను చూచి, ధైర్యంలో మేఱునగ సమానుడైన ధర్మజుడు నన్ను అడ్డు చెప్పకపోతే, కీచకుడిని, విరాటుడిని వారి సేనలను మట్టుబెట్టి వుండేవాడిని. కానీ! ద్రౌపదీ! అట్లా చేసియుంటే యింతకుముందు వలెనే మళ్ళీ అరణ్యవాసం చేయవలసి వచ్చేది. అది నీవూ నేనూ కలిసి కల్పించిన ఆపదగా జనులందరు నిందించరా? ఆ జనమాటలకు లోబడియుండే స్వభావంగల ధర్మరాజు ప్రశంసాపాత్రుడేగానీ నిందార్హుడు గాదు.
ద్రౌపదీ నిన్ను అవమనించిన కీచకుడిని మట్టుపెట్టడం యిప్పుడైనా మించిపోలేదు. ఈ విధంగా నీవు బాధపడనవసర లేదు. నేను వాడిని చంప నీ చింతను పోగొడతాను మనలను లోకులు గుర్తించని రీతిలో యుపాయం ఆలోచించాలి గానీ, శత్రువులను మట్టుబెట్టుట యొక లెక్కలోనిదిగాదు’’ అని అన్నాడు భీమసేనుడు
‘‘నా జీవితంలో నేను అత్తగారైన కుంతీదేవికి భయపడలేదు. పతులైన మీకూ భయపడలేదు. ఆ దైవానికి గూడా భయపడలేదు. కానీ దురాత్మురాలైన సుదేష్ణకు సేవలు చేస్తూ నేనమితంగా భయపడుచున్నాను. దుఃఖావేశంలో నేను ధర్మరాజును అట్లా అన్నానుగానీ అతడి గొప్పదనం తెలియనిది గాదు.
ఆ ధర్మరాజు ధర్మదీక్షవలన జగత్తు రక్షింపబడుచున్నది. ఆ ధర్మం వలననే మనం బ్రతుకుచున్నాము. అజాతశత్రుడనే బిరుదు కలిగియుండి గూడా దిగ్విజయం చేసి కీర్తిగడించడం, మిగిలిన భూపతులకు శక్యంగాని ‘రాజసూయ మహాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం, ధర్మాచార పరాయణుడని కీర్తించబడటం, ఆ యొక్క ధర్మరాజుకే దప్ప వేరొకరికి సాధ్యవౌతుందా? ఇతరులకు అసాధ్యం.
అటువంటి ధర్మరాజు యొక్క సాధారణ వ్యక్తివలె యెకరాకు వద్ద కూడూగుడ్డ కొరకు సపర్యలు చేయడం పేరు, వంశప్రతిష్ఠా, కులగౌరవం వదలి, గోప్యంగా వుండటం చూస్తే నాకు మిక్కిలి దుఃఖం కలుగుతున్నది.
అలాగే ఒక హిడింబ, ఒక బక, ఒక కిమీర, జరాసంధుల భయంకర గర్వాతిశయం నీ ముందు లొంగిపోయాయిగదా? అంతటి బల సంపన్నుడవైన నీవు నీ భుజబలాన్ని వంటకట్టెలు కొట్టడానికి, యితరులకు వినోదం కలిగించడానికి యుపయోగిస్తుంటే నాకు కడు దుఃఖం కల్గుచున్నది. లోకులు మెచ్చుకొనే నీ శరీరం యిట్లా నీచపు పనులకు తలొగ్గటం విధిగావించిన దుష్క్రియగాకపోతే మరేమిటి? తెలివిమాలిన ఆ విరాటుడు నీచేత జంతువుల చేత పోరాడింపజేసేటప్పుడు అంతఃపుర కాంతలను వినోదం కొరకు పిలిపించేవాడు. నేనూ వచ్చి నిన్ను చూస్తుండే దానిని.
ఆ సమయంలో సుదేష్ణ పరిజనాలతో ‘‘వలలుడిని సైరంధ్రి చూచే చూపులతీరు మనసు కలిసిన జాడ తెలియజేసేదిగా వున్నది. వీరిద్దరూ మన కొలువులోనికి యొకే సమయంలో రావడం కూడా జరిగింది’’అని అంటూ వుండేది.
..........................ఇంకావుంది