S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/11/2018 - 23:19

నెల్లూరు, మార్చి 11: ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ మరణం కూడా తమ స్నేహాన్ని విడదీయలేదని ఇద్దరు స్నేహితులు తనువు చాలించి నిరూపించారు. నగర శివార్లలోని సుందరయ్య కాలనీకి చెందిన తుమ్మల సుబ్రహ్మణ్యం (22), చింతల సతీష్‌కుమార్ అలియాస్ చిన్ని (23) మంచి స్నేహితులు. నిత్యం కలిసి తిరుగుతూ ఒకరి కష్టాన్ని మరొకరు తమదిగా భావించే మనస్తత్వం కలిగినవారు.

03/11/2018 - 23:02

ముదిగుబ్బ, మార్చి 11 : ముదిగుబ్బ పాతూరులో ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో వెంకటేష్‌నాయక్ (33) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై మహమ్మద్ గౌస్ తెలిపిన మేరకు ముదిగుబ్బ నుంచి మంగలమడకకు వెళ్తున్న ఆటోలో పొడరాళ్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌నాయక్‌తోపాటు మరో నలుగురు ప్రయాణిస్తుండగా పాతూరు సమీపంలో కుక్క అడ్డం రావడంతో అదుపుతప్పి బోల్తా పడింది.

03/11/2018 - 03:12

హైదరాబాద్, మార్చి 10: ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా సినిమా టిక్కెట్లను విక్రయించారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ఈజీ మూవీస్ బాసికా ఇన్ఫోటెక్ సంస్థపై కేసును రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ సంస్థపైన 2009లో సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాసికా ఇన్ఫోటెక్ సంస్థ తమ సంస్థపైన పోలీసులు నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

03/11/2018 - 03:09

హైదరాబాద్, మార్చి 10: ఈ నెల 5 నుంచి 9 వరకు నగర ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 630 చార్జిషీట్లను కోర్టులో దాఖలు చేశారు. వీరిలో 125 మందికి జైలు శిక్ష విధించగా, 33 మంది డ్రైవింగ్ లైసెన్సులను కోర్టు శాశ్వతంగా రద్దు చేసింది. ఇందుకు సంబంధించి నగర ట్రాఫిక్ జాయింట్ సిపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

03/11/2018 - 02:17

పటన్‌చెరు, మార్చి 10: పటన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని గీతం విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి అనుమానాస్పద స్థ్థితిలో మృతి చెందాడు. కళాశాలలోని భవనం ఐదవ అంతస్తు పైనుండి పడి ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

03/10/2018 - 02:17

ఉప్పల్, మార్చి 9: చెరువులో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రామంతాపూర్ నెహ్రూనగర్‌లో నివసిస్తున్న సాయిపోగు భరత్ - చిట్టీల కుమారుడు యశ్వంత్ (6) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటోతరగతి చదువుతున్నాడు.

03/10/2018 - 02:09

గచ్చిబౌలి, మార్చి 9: రాడార్ ఎలక్ట్రానిక్ పరికరాలు సరఫరా చేస్తానని రష్యన్ ఎంబసీని 42500 యూఎస్ డాలర్లు మోసానికి పాల్పడిన నిందితుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మోసం చేసిన మొత్తని వసూలు చేసి తిరిగి రష్యాకు అందించినందుకు ఆ దేశ ప్రతినిధులు.. రాచకొండ పోలీసులను అభినందించారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మోసానికి సంబంధించిన వివరాలను కమిషనర్ వెల్లడించారు.

03/10/2018 - 02:04

పర్చూరు, మార్చి 9: టీ చిక్కదనం కోసం టీ పొడిలో రంగులు కలిపి కల్తీ టీపొడిన అమ్ముతున్న ముగ్గురిని పర్చూరు పోలీసులు అరెస్టు చేసినట్లు చీరాల డిఎస్పీ డాక్టర్ ప్రేమకాజల్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కల్తీ టీ పొడి అమ్ముతున్న ముగ్గురుని శుక్రవారం విలేఖర్ల ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు.

03/10/2018 - 02:02

బుచ్చిరెడ్డిపాళెం, మార్చి 9 : ఒంటరిగా నిద్రించిన ఓ వృద్ధురాలు గురువారం రాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా పూరిల్లు దగ్ధమైన సంఘటనలో సజీవ దహనమైంది. ఆ వృద్ధురాలు ఇల్లు దగ్ధమవుతుంటే వృద్ధాప్యంతో పాటు అంధురాలు కావడంతో కదల్లేక అక్కడే కాలి బూడిదైందని పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సంఘటన బుచ్చిరెడ్డిపాళెం మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

03/10/2018 - 02:00

పొదలకూరు, మార్చి 9 : పొదలకూరు మండలం బత్తులపల్లి దళితవాడకు చెందిన ఊచపల్లి వెంకటేశ్వర్లు (22) అనే యువకుడు శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పొలాల్లో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వ్యక్తిగత పనులపై బుచ్చిరెడ్డిపాళెంకు వెళ్లిన వెంకటేశ్వర్లు తిరిగి ముందురోజు రాత్రి పదిన్నర గంటలకు అక్కడ నుంచి బయలుదేరాడు.

Pages