S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/06/2018 - 23:38

పెద్దఅడిశర్లపల్లి, ఏప్రిల్ 6: డ్రైవర్ నిర్లక్ష్యం.. ఇరుకు రోడ్డు వెరసి పడమటితండాకు చెందిన తొమ్మిది మంది నిరుపేద గిరిజన మహిళా కూలీల నిండు ప్రాణాలు నీటిపాలయ్యాయ. పొట్టకూటి కోసం శుక్రవారం తెల్లవారుజామునే కూలి పనికి వెళుతూ మార్గమధ్యలోనే ట్రాక్టర్ ఏఎమ్మార్పీ ఎత్తిపోతల ప్రధాన కాలువలో పడిపోవడంతో ఈ అత్యంత దయనీయ దుర్ఘటన చోటుచేసుకుంది.

04/06/2018 - 23:22

మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 6: జడ్చర్ల పట్టణంలో సుమారు రూ.7.60లక్షల విలువైన కాలం చెల్లిన విత్తనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేసినట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ అనురాధ తెలిపారు.

04/06/2018 - 04:23

అరకులోయ, ఏప్రిల్ 5: మతి స్థిమితం కోల్పోయిన గిరిజనుడు పాసింజర్ రైలు కింద పడి బుధవారం అర్థరాత్రి దుర్మరణం చెందాడు. మండలంలోని పెదలబుడు పంచాయతీ పానిరంగిని గ్రామానికి చెందిన పూజారి నోకుల్‌దాస్ (28) కిరండోలు నుంచి విశాఖపట్నం వెళ్లే పాసింజర్ రైలు కింద పడి మృతి చెందాడు. స్థానిక ప్రభుత్వ నివాసానుబంధ పారిశ్రామిక శిక్షణా సంస్థ ఎదురుగా ఉన్న రైలు పట్టాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

04/06/2018 - 03:11

సిరిసిల్ల, ఏప్రిల్ 5: సిరిసిల్ల పట్టణంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి రూ.6.25 లక్షల విలువల గల నిషేధిత గుట్కాల నిల్వలు పట్టుకున్నారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు, పోగాకు పధార్థాలను అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగిస్తున్న ఉదంతంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం ఉదయం నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

04/06/2018 - 02:20

హైదరాబాద్, ఏప్రిల్ 5: నకిలీ పత్రాలతో రెండు, మూడు పాస్‌పోర్టులు పొందిన ముగ్గురిని టాస్క్ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. పేర్లు మార్చుకుని రెండు, మూడు పాస్‌పోర్టులు తీసుకున్న వీరి నుంచి ఏడు పాస్‌పోర్టులు, ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, స్కూల్ సర్ట్ఫికెట్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నగర టాస్క్ఫోర్స్ డిసిపి పి.రాధాకిషన్‌రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

04/06/2018 - 02:20

వర్ధన్నపేట, ఏప్రిల్ 5: క్షణికావేశంలో మద్యం మత్తులో కన్న తండ్రిని హతమార్చిన కొడుకు ఉదంతం గురువారం రాత్రి వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కడారిగూడెంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు మంద అయిలయ్య (58) వేసవి కాలం కావడంతో తన ఇంటి ముందు నిద్రిస్తుండగా చిన్న కుమారుడు దేవేందర్ బండరాయితో తలపై మోదడంతో తండ్రి అయిలయ్య అక్కడిక్కడే మృతిచెందాడు.

04/06/2018 - 01:56

టి.నరసాపురం, ఏప్రిల్ 5: వివాహితను లైంగికంగా వేధించిన కుమారుడిని పెద్దల పంచాయతీకి తీసుకువస్తానని పోలీసులకు ఫిర్యాదుచేయకుండా అపిన తండ్రి తదనంతరం నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో ఆగ్రహించిన గ్రామ పెద్దలు అతడిని చెట్టుకు కట్టేశారు. దీనితో మనస్తాపానికి గురైన ఆ తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

04/06/2018 - 01:40

చిలమత్తూరు, ఏప్రిల్ 5 : మండల పరిధిలోని పెద్దనపల్లి క్రాస్ వద్ద గురువారం ఉదయం ద్విచక్ర వాహనం టిప్పర్‌ను ఢీకొన్న ఘటనలో చంద్రమోహన్ (33) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

04/06/2018 - 01:16

* మృతుడు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పీఏ
* పుణ్యక్షేత్రాలకు వెళ్లి వస్తూ మృతి

04/06/2018 - 03:42

న్యూఢిల్లీ:అవినీతిపరులు, అక్రమాలకు పాల్పడేవారితో అధికారులు కుమ్మక్కవడంవల్లే కుంభకోణాలు జరుగుతున్నాయని, వీటిని నిరోధించడంలో ‘ఆధార్’ పాత్ర చాలా స్వల్పమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బ్యాంకు కుంభకోణాల నివారణకు ఆధార్ పరిష్కారం కాదని అభిప్రాయపడింది.

Pages