S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/09/2018 - 02:48

జమ్మూ, డిసెంబర్ 8: జమ్మూకాశ్మీర్‌లో పూంచ్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో 13 మంది దుర్మరణం చెందారు. 17మంది గాయపడ్డారు. 42 సీటర్ల ప్రయాణికుల బస్సు మండి ప్రాంతంలోని ప్లేరాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు లోరాన్ నుంచి పూంచ్‌కు వెళ్తుండగా అదుపుతప్పి లోయలోపడిపోయిందని పోలీసులు వెల్లడించారు.

12/09/2018 - 01:00

హైదరాబాద్ నల్లకుంట, డిసెంబర్ 8: మద్యం మత్తులో ఉండి ఇద్దరు వ్యక్తుల మధ్య చేలరేగిన సంఘర్షణ కత్తిపోట్లకు దారితీసిన ఘటన అంబర్‌పేట్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అంబర్‌పేట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ కథనం ప్రకారం.. గోల్కానాలోని జిందాతిలస్మాత్ ప్రాంతానికి చెందిన షాహిద్ (26), ఖాధ్రిభాగ్ ప్రాంతానికి చెందిన అన్వర్ అలియాస్ అన్ను (45)లు కలిసి శనివారం మధ్యాహ్నం మద్యం సేవించారు.

12/09/2018 - 01:00

మెహిదీపట్నం, డిసెంబర్ 8: బస్సు కింద పడి ఓ యువకుడు దుర్మరణం చెందిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం... లంగర్‌హౌస్ అంబేద్కర్ నగర్‌కు చెందిన చంద్రయ్య కుమారుడు ఏ.ప్రవీణ్ (21) గుడిమల్కాపూర్‌లోని పూల మార్కెట్‌లో పూల వ్యాపారి.

12/09/2018 - 00:53

హైదరాబాద్, డిసెంబర్ 8: అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగడంతో స్వల్పంగా దగ్ధమైన ఘటన శనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో సైఫాబాద్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

12/09/2018 - 00:43

నాగాయలంక, డిసెంబర్ 8: మండలంలోని ఏటిమొగ గ్రామానికి చెందిన శైకం బసయ్య (62) చేపల వేటకు వెళ్లి మృతి చెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.

12/09/2018 - 00:01

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం శేరీదింటకుర్రు గ్రామంలో శనివారం నాటు తుపాకీ పేలి 8వ తరగతి విద్యార్థి చిటికెనేని కరుణానిధి (14) దుర్మరణం పాలయ్యాడు. చేపల చెరువుల వద్ద కాపలా ఉంటున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన చిన్నా గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలతో కలిసి తన దగ్గరున్న నాటు తుపాకీతో పక్షులను చంపి వాటిని మంటలో కాల్చుకుని తింటున్న సమయంలో చిన్నా చేతిలో తుపాకీ అకస్మాత్తుగా పేలింది.

12/08/2018 - 23:12

చిత్తూరు , డిసెంబర్ 8: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. జిల్లా కోర్టులో ఈ కార్యక్రమాన్ని జిల్లా న్యాయమూర్తి వౌలానా ఇతర న్యాయమూర్తులు స్వయంగా పర్యవేక్షించారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రంమలో భాగంగా కేసులు విచారణ కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 27 బెంచ్‌లను ఏర్పాటు చేశారు.

12/08/2018 - 23:08

అరకులోయ, డిసెంబర్ 8: స్థానిక ప్రధమ శ్రేణి జుడిషియల్ మండల మెజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అధాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు సత్వర న్యాయం కోసం జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అధాలత్‌ను నిర్వహించి 102 కేసులను పరిష్కరించారు. స్థానిక ప్రధమ శ్రేణి జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్‌చార్జి జడ్జి ఎ.క్రిష్ణప్రసాద్ వంద ఎక్సైజ్ కేసులు, రెండు ఐ.పి.సి.

12/08/2018 - 23:04

టెక్కలి, డిసెంబర్ 8: జాతీయలోక్ అదాలత్ ద్వారా పెండింగ్‌లో వున్న కేసులను రాజీ మార్గంలో పరిష్కారించుకోవడం రాజమార్గమని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాంతిశ్రీ అన్నారు. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్, న్యాయవిజ్ఞాన సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కక్షిదారులు కేసులను సత్వరం పరిష్కారించుకోవడంతో ఆర్థికంగా, సమయం కూడ వృధాకాకుండా కాపాడుకోవచ్చునన్నారు.

12/08/2018 - 23:04

పాలకొండ (టౌన్), డిసెంబర్ 8: స్థానిక న్యాయస్థానం ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్ ద్వారా 225 కేసులు పరిష్కారమయ్యాయి. న్యాయమూర్తి షేక్ జియా ఉద్దీన్ ఆధ్వర్యంలో న్యాయ స్థానం పరిధిలో పలు మండలాల నుంచి అధిక సంఖ్యలో కక్షిదారులు హాజరయ్యారు. ఐపీసీ-50, ఎంసీ 1, సూట్ 3, ఎల్ ఏ 10, ఈటీసీ 225, అలాగే ఇతర కేసులు 13 మొత్తం 225 కేసులు రాజీ కుదిరినట్టు న్యాయమూర్తి వెల్లడించారు.

Pages