క్రైమ్/లీగల్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 28 : ఒక వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో మనస్థాపానికి గురై ఆ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెదపాడు మండలం ఏపూరు పంచాయితీ ఆత్రేయపురానికి చెందిన గొల్లపల్లి దేవసాయం (45) అనే వ్యక్తిపై ప్రత్యర్ధులు ఫిర్యాదు చేయడంతో అతనిపై ఎస్‌సి, ఎస్‌టి కేసు గతంలో నమోదైంది. ఈ నేపధ్యంలో కాని నేరానికి తనపై కేసు పెట్టారని మనస్థాపానికి గురై ఆదివారం తెల్లవారుఝామున గ్రామంలోని ఒక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెదపాడు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.