క్రైమ్/లీగల్

.రైసు మిల్లుపై విజిలెన్స్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, ఏప్రిల్ 20: పట్టణంలోని రైసుమిల్లుపై శుక్రవారం ఉదయం నుంచి విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కె కృషన్ ఆధ్వర్యంలో అధికారులు డబ్బీవీధిలోని బొడ్డెపు వెంకటలక్ష్మి మోడ్రన్ రైసుమిల్లులో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. 270క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంతోపాటు 1409క్వింటాళ్ల ధాన్యం, 72క్వింటాళ్ల సాధారణ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 30లక్షలకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈమేరకు రికార్డులు, మిల్లును సీజ్ చేశారు. పీడీఎస్ బియ్యంతో ఇతర బస్తాలను సీఎస్‌డీటీ రామకృష్ణకు అందించారు. తమకు అందించిన సమాచారం మేరకు దాడులు నిర్వహించాలని విజిలెన్స్ అధికారి కె కృషన్ తెలిపారు. మిల్లు యజమానులు బొడ్డెపు చంద్రశేఖర్, వెంకటరమణలపై కేసు నమోదుచేశామన్నారు. మిల్లును అనధికారికంగా నడుపుతున్నారన్నారు. ఈ దాడుల్లో ఆర్‌ఐ గణేష్‌రెడ్డి, వీఆర్‌ఓలు శ్రీనివాసరావు, రామకృష్ణ పాల్గొన్నారు.