క్రైమ్/లీగల్

గుండెపోటుతో ఆర్టీసి డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, అక్టోబర్ 27: పాడేరు ఆర్.టి.సి. డిపోకు చెందిన డ్రైవర్ ఇ.ఎస్.నారాయణ శనివారం గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణ ముగించుకునే సమయంలో గుండెపోటు రావడంతో ప్రయాణికులకు ఎటువంటి ముప్పు వాటిల్లలేదు. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపేట బస్సు సర్వీసుకు శుక్రవారం మధ్యాహ్నాం విధులకు వెళ్లిన డ్రైవర్ నారాయణ శనివారం మధ్యాహ్నాం పాడేరుకు చేరుకున్నారు. స్థానిక డిపోలో బస్సును అప్పగించి విధులను ముగించుకునే సందర్భంలో డిపో సెక్యూరిటీ వద్దకు వెళ్లేసరికి గుండెపోటుకు గురయ్యారు. సెక్యూరిటీ విభాగం వద్ద బస్సును ఆపి కిందకు దిగిన డ్రైవర్‌కు ఒళ్లంతా చెమటలు పట్టి కుప్పకూలిపోవడంతో సిబ్బంది హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న సందర్భంలో డ్రైవర్ నారాయణ మృతి చెందారు. గుండెపోటు కారణంగానే డ్రైవర్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తమ డ్రైవర్ మృతి పట్ల డిపో కార్మికులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు.

లారీ ఢీ కొని వ్యక్తి మృతి
* మరొకరికి తీవ్ర గాయాలు
మాకవరపాలెం, అక్టోబర్ 27: మోటార్ సైకిల్‌ను లారీ ఢీ కొన్న సంఘటనలో ఒక యువకుడు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాచపల్లి గ్రామానికి చెందిన కిల్లాడ అయ్యప్ప (19) , యరకన్నపాలెం గ్రామానికి చెందిన పైల బైరాగి శుక్రవారం రాత్రి మాకవరపాలెం నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామం వెళ్తున్నారు. వారు వారు రాచపల్లి జంక్షన్‌కు వెళ్ళే సరికి తాళ్ళపాలెం నుంచి నర్సీపట్నం వస్తున్న లారీ వారి బైక్‌ను ఢీ కొంది. దీంతో అయ్యప్ప లారీ వెనుక చక్రం కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి బైరాగికి తీవ్ర గాయాలు కావడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రధమ చికిత్స చేసి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈసంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకై ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు అయ్యప్ప ఐటీ ఐ చదువుకున్నాడు. తంఢ్రి రమణ కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు చిన్నవయస్సులోనే మరణించడంతో ఆకుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.