క్రైమ్/లీగల్

రైలు పట్టాలపై గుర్తు తెలియని మహిళ మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, మార్చి 21: అరకులోయకు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘోరాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం బుధవారం కనుగొన్నారు. కె.కె.లైన్ మార్గంలోని పిట్టమర్రిగుడ, అంతర్ రాష్ట్రం ఒడిస్సాకు చెందిన చటువా గ్రామాలకు మధ్యనున్న రైలు పట్టాల పక్కన సుమారు 55 సంవత్సరాల వయస్సు కలిగిన మహిళ మృతదేహాన్ని గిరిజనులు కనుగొన్నారు. ఈ మహిళ మృతదేహం రైలు పట్టాలపై పడి ఉండడాన్ని చూసిన గిరిజనులు ఘోరాపూర్ రైల్వే స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ సంఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. మహిళను ఎవరో హత్య చేసి రైలు పట్టాల పక్కన పడేసినట్టుగా పలువురు అనుమానిస్తున్నారు. మృతురాలు ఎరుపు రంగుపై నలుపు గీతలు ఉన్న చీర, నీలం రంగు జాకెట్ ధరించి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆనందపురంలో ప్రేమజంట ఆత్మహత్య
* కొవ్వూరు గ్రామంలో విషాదఛాయలు
రోలుగుంట, మార్చి 21: ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్ల చేసుకోవాలని అనుకున్నా అది నెరవేరలేదు. కలిసి బ్రతకాలనుకుని ఇద్దరు వెళ్ళిపోయి బంధువుల వస్తున్నారన్న సమాచారం తెలుసుకుని భీమిలి సమీపంలో ఆనందపురం సమీప తోటల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈవిషాద సంఘటనకు సంబంధించి కొవ్వూరు గ్రామస్తులు అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొవ్వూరు గ్రామానికి చెందిన బంటు రేవతి (22), యర్రంశెట్టి రమణాజీ(28) అలియాస్ హరిబాబులు ఏడాదిన్నర కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈవిషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ పై రెండు కుటుంబాలు వివాహానికి నిరాకరించారు. కాగా రమణాజీకి కోటవురట్ల మండలం కె.వెంకటాపురం గ్రామానికి చెందిన సాయితో గత ఏడాది మార్చిలో వివాహం జరిగింది. అయినప్పటికీ వీరిద్దరి మధ్య ప్రేమ బంధం కొనసాగుతూనే ఉంది. రమణాజీ 10వ తరగతి చదువుకుని తన మామయ్యకు చెందిన ప్రైవేట్ కంపెనీలో విశాఖలో పని చేస్తూ 10 రోజుల కోసారి స్వగ్రామమైన కొవ్వూరు వచ్చి వెళ్తుండేవాడు. రేవతి భీమిలికి సమీపంలో అనందపురం ప్రైవేట్ కాలేజ్‌లో 2012 సంవత్సరంలో బీ ఫార్మసీ పూర్తి చేసి నర్సీపట్నంలోని మెడికల్ షాపులో పని చేస్తుంది. తల్లిదండ్రులు నిరాకరించినప్పటికీ వీరిద్దరూ కలుస్తూ ఉన్నారు. ఈనెల 17వ తేదీన ఉదయం రేవతి , రమణాజీలు మోటార్ బైక్‌పై నర్సీపట్నంలోని మెడికల్ షాపుకు వచ్చారు. అనంతరం వీరిద్దరూ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వీరిద్దరి కోసం వెతికారు. ఇద్దరూ కనిపించకపోవడంతో ఈనెల 19వ తేదీన నర్సీపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. కాగా రేవతి , రమణాజీలు తాము ఇద్దరం వెళ్ళిపోయామని, తిరిగి రావడం జరగదని సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా మమ్మల్ని వెతుకులాట ప్రారంభిస్తే తాము చనిపోతామంటూ మెసేజ్‌లు పెట్టారని తెలిపింది. అయితే పోలీసులు, తల్లిదంఢ్రులు సిగ్నల్స్ ద్వారా వీరు ఎక్కడ ఉన్నదీ ట్రేస్ చేస్తూ వెతుకున్నారు. ఆనందపురంలో ఉన్నట్లుగా గుర్తించి వీరు ప్రయత్నాలు చేస్తుండగా బుథవారం ఉదయం ఆనందపురంలోని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వీరిద్దరూ కుటుంబ సభ్యులు తోటల్లో చూడగా రేవతి, రమణాజీల మృతదేహాలు కనిపించడంతో పై రెండు కుటుంబాలకు చెందిన వారు తల్లిడిల్లిపోయి గుండెలు అలిసేలా రోధిస్తున్నారు. ఈవిషయం గ్రామానికి సమాచారం అందడంతో పై రెండు కుటుంబాలకు చెందిన బంధువులు విలపిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన రెండు కుటుంబాల్లో ఇంతటి విషాదం జరగడం పట్ల గ్రామస్తులంతా విషాదవదనంలో ఉన్నారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పీహెచ్‌సీలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. మృత దేహాలు రాత్రికి కొవ్వూరు చేరుకుంటాయని, గురువారం అంత్యక్రియలు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు.