వాసిలి వాకిలి

గ్రహాలతో స్నేహించాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తానికి నవగ్రహాల ప్రభావంతో కొన్ని లక్షల తరాలను దాటుకుంటూ వచ్చాం. తరాలు మారుతుండటంతో సంక్లిష్టతలూ బలపడుతూ వచ్చాయి.. ఆధ్యాత్మిక ప్రాంగణాలలోను ఆధిపత్య పోరు పెరుగుతూ వస్తోంది. తమ వ్యవస్థ నిలదొక్కుకుంటే చాలనే పట్టుదల వేళ్లూనుకుంది. ఆధ్యాత్మికత్వం సైతం ధనికులకు సెపరేట్‌గా, పేదలకు సెపరేట్‌గా తయారైంది. ఒక వర్గానికి ఒకలా, మరొక వర్గానికి మరొకలా స్పిరిట్యుయల్ టెంపర్‌మెంట్ నెలకొంటోంది. ఇక్కడ కూడా ప్లానెటరీ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది. శుద్ధ సంకల్పం, పారదర్శక వర్తనం సాధ్యం కానపుడు ఎటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంలోనైనా కలుపు మొక్కలు ఏపుగా పెరుగుతూనే ఉంటాయి.
* * *
ఇటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తన ధ్యాన మార్గంతో దారి మళ్లించాడు బుద్ధుడు. యోగ మార్గంలో గ్రహాలతో ప్రత్యక్ష సంబంధాన్ని పెంచాడు. గ్రహాలతో మిత్ర వైఖరి వల్ల సమస్యల నుండి బయటపడవచ్చని సూచించాడు. ఈ క్రమంలో భౌతిక, బౌద్ధిక సమస్యల నుండి బయట పడటానికి ఆత్మయోగాన్ని మనందరికీ అందించాడు. మొత్తానికి దృశ్యమానమవుతున్న గ్రహాలతో స్నేహించటమే ధ్యాన మార్గం.
మనం ఈ భూమిపైన 103 స్థితులలో గ్రహాల ప్రభావాలకు లోనవుతుంటాం అన్నది ఒక సిద్ధాంతం. పైగా కొన్ని వేల సంవత్సరాలుగా రిట్రాగ్రెడేషన్స్, ఎస్సెంట్రిసిటీస్ ఆఫ్ ది ఆర్బిట్స్ మొదలైనవి మానవ పరిణామానికి, విశ్వ పరిణామానికి అవరోధమూ, ఆటంకమూ కావటమే కాకుండా ‘ఎవల్యూషన్’తో ‘ఇర్రెగ్యులారిటీస్’ బలపడటానికీ కారణాలయ్యాయి. ఈ కారణాలతోనే మనిషి సంపూర్ణుడు, పరిపూర్ణుడు కావటానికి బదులు అల్పాయుష్కుడు అవుతున్నాడు.
ఇంతటి నేపథ్యానికీ పరిష్కారం ఒక్కటే-
మనిషికి ‘్భతిక అమరత్వం’ సాధ్యం కావాలి. అంటే తానే ‘స్వయంభువు’లా మారాలి. ఈ అవకాశం ఒక్క యోగ సాధన వల్లనే ఫలవంతమవుతుంది.
యోగ సాధన ప్రారంభించాక మనకు మనమే మాస్టర్ కాగల అవకాశం ధ్యాన మార్గంలో సాధ్యం. ఇలా సృష్టి లోపాలను, గ్రహ నక్షత్ర ప్రభావాలను పసికట్టిన మాస్టర్ సి.వి.వి. కాస్మిక్ టెంపర్‌మెంట్‌ను, ఇన్‌ఫ్లుయెనె్సస్‌ను క్రమపరిచి ‘్ఫజికల్ ఇమ్మోర్టాలిటీ’ని సాధించాలన్న ప్రయత్నంతో ‘్భృక్తరహిత తారక రాజయోగ’ మార్గాన్ని మనకు అందించారు.
మొత్తానికి భౌతిక దేహాత్మ అధిభౌతిక అధ్యాత్మగా విశ్వావరణల శక్తితో పరిణమించటమే స్పిరిట్యుయాలిటీ లక్ష్యం.. దానికి ధ్యానపరంగా చేసే యోగ సాధన ఉన్నత మార్గం.
భౌతిక అమరత్వ సాధన
భూతలంలో మానవ రూపంలో వొదిగిన మన ఆత్మ దైహిక నిర్మాణం మధ్య ఒక అతిథి. ప్రాపంచికంగా ఆత్మది పర్యాటక పాత్ర. జనన మరణాల మధ్య జీవితం అనే చట్రంలో మానవ ధర్మం పేరిట వొదిగినా విశ్వధర్మంతో శాశ్వత ప్రాతిపదికన వర్తిస్తుంటుంది. భౌతిక పరిధులలో ఆత్మ ప్రాపంచిక అవసరాలకు ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ పారలౌకిక ప్రయాణానికి సదా సంసిద్ధమై ఉంటుంది. ఈ అధిభౌతికయానమే ధ్యానం.. విస్తృత పరిధిలో యోగం, తపస్సు.
భౌతిక, అధిభౌతిక స్థితులు
విశ్వ పరిణామానికి అంతం లేనట్లే పరిణమిస్తుండటమే సృష్టి అన్నట్లుగా ధ్యానం, యోగం, తపస్సు విస్తృత పరిధిలో పరిణమిస్తూ పోతుండవలసిందే. ఏ ఒక్క మహాత్ముని ధ్యాన సాధనతోనో, యోగ సాధనతోనో, తపస్సాధనతోనో పరిణామం పూర్తి కాదు. అది నిరంతరంగా కొనసాగుతుంటుంది. కాలప్రభంజనంలో ఒక్కో మహాత్ముడూ మానవత్మాగా పరిణమిస్తూ తమ పాత్రను నిర్వహించి భౌతికం నుండి తప్పుకుంటూ అధిభౌతికాన్ని కొంతవరకు భౌతికానికి చేరువ చేయటం జరుగుతుంటుంది. అలా మానవ జన్మతో దివ్యపరీమళాలను పంచినవారే మహాపురుషులు.. వారందరూ పూర్ణ పురుషులే.. వారి దివ్యత్వ పూర్ణ కుంభమే.. అమృత కలశమే. వారిలో ‘అమృతత్వ’ ‘కుంభ’యోగి మాస్టర్ సి.వి.వి.
భౌగోళిక పరిధిలో మానవాత్మగా వర్తించే ఆత్మ దైహికం నుండి విడివడి బౌద్ధిక, మానసిక బంధనాల నుండి బయటపడి ఖగోళిక, అధ్యాత్మ నిర్వాణిక, పర నిర్వాణిక, మహా పరనిర్వాణిక స్థితులలో అధిభౌతికం అవుతుంటుంది. ఈ ఆరు స్థితులనే మనకు అందిన జ్ఞానంతో ప్రాంగణాలలు, మండలాలు అంటుంటాం. ఈ ప్లేన్స్‌లో మనం సాధించిన పరిణతిని షట్చక్రాల పేరిట అవగతం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంటాం. దేహ పరిధిలో అంతరాత్మగా ఉన్న మానవాత్మ దైహిక, బౌద్ధిక, మానసిక పరిణతిని సాధించి అంటే, ప్రాపంచికంగా పారదర్శకంగా, పరిశుద్ధంగా జీవిక ముగించటం ‘దైహిక నిర్వాణం’ దీనే్న ‘మరణం’ అంటాం.

-విశ్వర్షి 93939 33946