వాసిలి వాకిలి

వర్తమాన వర్తనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకత్వంలో భిన్నత్వం.. భిన్నత్వంలో ఏకత్వం - ఆత్మపరంగానైనా, అధ్యాత్మపరంగానైనా, భౌతికంగానైనా, అధిభౌతికంగానైనా, సైన్స్‌పరంగానైనా, స్పిరిట్యుయాలిటీ పరంగానైనా జరిగే పరిశోధనలు, ఆత్మశోధనలు, శాస్ర్తియ ప్రయోగాలు, అతీంద్రియ యోగ క్రియలు - ఈ రహస్యాల గుండా మన జీవితాలను ప్రయాణింపచేయటం పరిపూర్ణంగా పరిణమించటానికే. అయితే పరిణమిస్తూ ‘ఏకీభావన’కు రాకపోవటమే, ‘ఏకదృష్టి’తో జీవిక సాగించలేక పోవటమే మన లౌకిక, అలౌకిక సంక్లిష్టతలకు భూమిక.
మనం నిత్యకర్మలతోను, నైమిత్తిక కర్మలతోను ‘కర్మజీవులం’ అవుతున్నాం.. కర్మ, జ్ఞాన యోగ సాధకులం అవుతున్నాం.. ఐహికంగాను, ఆముష్మికంగాను దృశ్య, అదృశ్యాల మధ్య ‘అర్థనిమీలితులం’ అవుతున్నాం.. శుద్ధ అహంకారానికి, అశుద్ధ అహంకారానికి నెలవుల మవుతున్నాం.. ఆస్తికులమూ నాస్తికులమూ అవుతున్నాం.. సత్వ, రజో, తమో గుణాలతో కుంచించుకు పోతూ తప్పిపోతున్నాం.. కాంతకు, కనకానికి, కీర్తికి దాసులం అవుతున్నాం.. బ్రహ్మర్షిగానో, దేవర్షిగానో, రాజర్షిగానో, విశ్వర్షిగానో పరిణమించాలనే ప్రయత్నంతో ‘పేరు’బడుతున్నాం.
జీవితం వృద్ధత్వంలోకి అడుగిడుతున్నా వయోవృద్ధులం అవుతున్నామే తప్ప జ్ఞానవృద్ధులం, తపోవృద్ధులం కాలేక పోతున్నాం.. మన నుండి మనమే వేరుపడుతున్నామే తప్ప వౌనానికి, శాంతానికి, సత్యానికి చేరువ కాలేకపోతున్నాం.. కామాగ్ని, క్రోధాగ్ని, క్షుధాగ్నిలకే జీవితాన్ని పరిమితం చేస్తున్నాం. స్వమతానికి బద్ధులం కాలేక ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అంటూ చలనశీలురం అవుతున్నాం. ఫలితంగా మనకు మనంగా శారీరక కష్టంతోను, మానసిక కష్టంతోను, సామాజిక కష్టంతోను, ఆధ్యాత్మిక కష్టంతోను ‘కష్టజీవులం’ అవుతున్నాం.
నేటి కలియుగంలోనే కదా.. గతించిన కృతయుగంలోనైనా, త్రేతాయుగంలోనైనా, ద్వాపర యుగంలోనైనా మానవ జీవితం కాస్త కుడి ఎడమలుగా కష్టాల కొలిమిగానే సాగుతూ వస్తోంది.. ఇంతటి అయోమయ స్థితిలో మనశ్శుద్ధి, కర్మశుద్ధి, భాండశుద్ధి, దేహశుద్ధి, వాక్సుద్ధి సాధ్యం కావటంలేదు. పైగా కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలతో మనదైన స్థితికి దూరం అయిపోతున్నాం. అయినా అష్టవిధాల సిద్ధించాలని ఆరాటం.. అష్టసిద్ధుల కోసం ప్రయత్నం.. ఫలితంగా అర్థనిమీలితమై సప్తదేహ కార్య నిర్వాహకులం అవుతుంటాం.. ఆర్తితో ధ్యానాత్మల మవుతాం.. సాధనతో యోగమూర్తుల మవుతాం.. ఇక్కడి నుండి మన జ్ఞానం, విజ్ఞానం ప్రజ్ఞానంగా పరిణమించడమే యోగ దర్శనం. ఇది ఆత్మదర్శనంతో సాధ్యమయ్యే విశ్వదర్శనం. మన ఏకాంతం నుండే ఈ దర్శనాలు సాధ్యం. ఈ నేపథ్యమంతా మనం యోగసాధనలో నెలకొనటానికే.
పరిణామ ప్రభావాలు
భౌతికంగా మన పైన అనేకానేక ప్రభావాలు.. అవి ప్రాపంచికాలుల, సామాజికాలు, సాంస్కృతికాలు, వంశానుగతాలు, మానసికాలు, బౌద్ధికాలు. వీటికి గ్రహాల ప్రభావాలు, నక్షత్రాల ప్రభావాలు, ఇతర ప్రాకృతిక శక్తుల ప్రభావాలు, దైవిక శక్తుల ప్రభావాలు తోడవుతుంటాయి. విశ్వపరిణామ ప్రభావాలు వీటన్నిటికంటే శక్తివంతాలు. ఒక విధంగా మన మనుగడను ఈ ప్రభావాలన్నీ నిర్దేశిస్తుంటాయి. అంటే విశ్వ పరిణామం మానవ పరిణామంపై ప్రభావం చూపుతున్నట్లుగానే మానవ పరిణామం విశ్వ పరిణామంపై ప్రభావం చూపుతున్నట్లే. అంటే మనంగా చేసే ప్రయత్నాలు మన అస్తిత్వానికే కాక విశ్వ పరిణామానికీ దోహదం చేస్తాయి.
మన విశ్వం ఆవిర్భవించింది మహావిస్ఫోటన ఫలితంగానే. ఈ విశ్వాన్ని శాస్ర్తియంగా అధ్యయనం చేసే శాస్తమ్రే ఖగోళ శాస్త్రం. విశ్వాన్ని అధిభౌతికంగా అధ్యయనం చేసేది ఆధ్యాత్మికత్వం. నిజానికి భూగోళం కూడా ఖగోళంలో అంతర్భాగమే అయినా మనం భూగ్రహ వాసులం కాబట్టి భూమి మినహా తక్కిన విశ్వాన్ని ఖగోళం అంటున్నాం.
ఒక్కసారి మనం తలపైకెత్తితే కనిపించే వినీలాకాశమంతా దుమ్ము, ధూళి కణాలతోను వేడి వాయువులతోను వేగంగా తిరిగే నీహారికలమయం.. ఈ నీహారికల అణువుల అభిగాతం వల్లే విశ్వచలనం సాధ్యమవుతోంది. పైగా మనకు కనిపించే నక్షత్రాలన్నీ పుట్టింది ఈ నీహారికల నుండే.
నక్షత్రాలంటే స్వయంప్రకాశక శక్తిని కలిగిన ఖగోళ పదార్థాలే! ఇటువంటి కొన్ని కోట్ల నక్షత్రాలు కలిస్తే ఏర్పడేదే పాలపుంత. సర్పిలాకారంగా ఉండే పాలపుంత ఒకటిన్నర మిలియన్ నక్షత్రాలకు నెలవు. ఈ పాలపుంతనే కొందరు ‘ఖగోళ నది’ అని అంటుంటే, ఇంకొందరు ‘స్వర్గానికి రహదారి’ అని అంటుండగా, మరి కొందరు ‘దేవుని పాదముద్రలు’ అని అంటున్నారు. ‘ఎప్సిలాన్ ఆరెగా’ అనేది అతి పెద్ద నక్షత్రం. అయితే ‘సిరియస్ -ఎ’ అనేది అతి ప్రకాశవంత నక్షత్రం. అన్నట్టు సూర్యుడు కూడా ఒక మధ్యతరహా నక్షత్రమే అయినప్పటికీ మనం సూర్యుడ్ని ఒక గ్రహంగానే పరిగణిస్తున్నాం. హైడ్రోజన్, హీలియం వాయువులు అధికంగా ఉండే వాయుగోళమే సూర్యుడు. ఇటువంటి సూర్యుడిలోనైనా, ఇతర నక్షత్రాలతోనైనా శక్తి జనించటానికి కారణమైన చర్యనే కేంద్రక సంలీనం అంటుంటాం. ఇక కొన్ని నక్షత్రాలలో తాత్కాలిక విస్ఫోటనాలు సంభవిస్తుండటం మనం ఎరుగుదుం.
తమాషా ఏమిటంటే, మనం ఆత్మప్రదక్షిణ చేసినట్లుగా సూర్యుడి ఆత్మభ్రమణానికి 25 రోజుల 9 గంటల సమయం పడుతుంది. సూర్యుడు ప్లస్ చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్ర, శని, రాహువు, కేతువు కలిసిందే సౌర కుటుంబం. వీటిల్లో భ్రమణకాలం తక్కువ, భ్రమణ వేగం ఎక్కువగా వున్న గ్రహం గురుగ్రహం. అయితే బృహస్పతికి విరుద్ధంగా భ్రమణకాలం ఎక్కువ, భ్రమణ వేగం తక్కువగా ఉన్న గ్రహం శుక్రగ్రహం. ఇక సౌర కుటుంబంలో అధిక బరువైన గ్రహం భూమి అయితే అతి తేలికైన గ్రహం శని.

-విశ్వర్షి 93939 33946