వాసిలి వాకిలి
నేను.. ఆత్మ ప్రబోధాన్ని...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నేను అమాత్రను
ఏ కాలమానాలు లేనివాడ్ని
నేను విరాగిని
ఏ కొలమానాలు లేనివాడ్ని.
నేను గికాన్ని
ఖగోళ చైతన్యాన్ని
నేన యోగిని
పురుష ప్రకృతుల ప్రజ్ఞను.
* * *
నేను-
దేహంలో ఒక వాహనాన్ని మనసులో ఒక వాహనాన్ని. ఈ దేహాన్ని, మనసును ఉపయోగించి నడిపేదీ వాహనమే. రెండు చక్రాలదయినా, మూడు చక్రాలదయినా, నాలుగు చక్రాలదయినా ఆ వాహన వేగాన్ని కొలిచేది గంటకు కిలోమీటర్లు లేదా మైళ్ల లెక్కన. అలాగే మన మనస్సుగా చెప్పుకునే బ్రెయిన్‌వేవ్స్ స్పీడ్‌ను హెర్జ్ సైకిల్స్‌గా క్షణాలలో కొలుస్తాం.
మన మైండ్ గామా - బీటా - అల్ఫా - తేటా - డెల్టా అంటూ అయిదు రకాల స్థితులలో పని చేస్తుంటుంది. బ్రెయిన్ వేవ్స్ స్పీడ్‌ను బట్టి ఈ స్టేట్స్‌ను నిర్ధారించటం జరిగింది. గరిష్ఠంగా ఆలోచనా తరంగాలు ఉండేది గామా స్టేట్‌లో అయితే కనిష్ఠంగా డెల్టా స్టేట్‌లో.
గామా బ్రెయిన్ వేవ్స్ వేగం - 40 అంతకంటే అధిక హెర్జ్‌లు
బీటా బ్రెయిన్ వేవ్స్ వేగం - 40 నుండి 14 హెర్జ్‌ల వరకు
అల్ఫా బ్రెయిన్ వేవ్స్ వేగం - 14 నుండి 7.5 హెర్జ్‌ల వరకు
తేటా బ్రెయిన్ వేవ్స్ వేగం - 7.5 నుండి 4 హెర్జ్‌ల వరకు
డెల్టా బ్రెయిన్ వేవ్స్ వేగం - 4 నుండి 0.5 హెర్జ్‌ల వరకు
హయ్యర్ బ్రెయిన్ వేవ్స్ వేగం - 0.5 హెర్జ్ అంతకంటే తక్కువ
ఇఇజి సెన్సార్స్ యంత్రం గామా నుండి డెల్టా వరకు బ్రెయిన్ వేవ్స్ స్పీడ్‌ను చూపగలుగుతుందే కానీ, 0.5 కంటే తక్కువ బ్రెయిన్ వేవ్స్ స్పీడ్‌ను చూడలేదు.. అంటే మానవ మేథతో తయారైన యంత్రం చూపలేనిదంతా హయ్యర్ బ్రెయిన్ అవుతోంది. విజ్ఞానశాస్త్ర పరిధిలో ఈ హయ్యర్ బ్రెయిన్‌కు కొలమానం సాధ్యం కావడం లేదు.
హయ్యర్ బ్రెయిన్ ప్రజ్ఞానాన్ని అధిక శాతం యోగి పుంగవులలోనే చూడగలం. కొందరు శాస్తజ్ఞ్రుల పరిశోధనా ఫలితాలు కూడా ఆ శాస్తజ్ఞ్రుల హయ్యర్ బ్రెయిన్ విజ్ఞానకోశమే! గికంగా ‘ప్రాణం పోకడ - ప్రాణం రాకడ’లన పర్యవేక్షించగల సమర్థత ఈ ‘ఇన్‌ఫ్రా -లో ‘స్టేట్’లోనే సాధ్యవౌతుంది. గికంగా ప్రాణా ట్రీట్ సాధ్యవయ్యేది ఈ స్థితిలో నిలకడైన బ్రెయిన్ వేవ్స్ వల్లనే. సంకల్ప సంపూర్ణ సాఫల్య స్థితి ఇది.
* * *
డెల్టా బ్రెయిన్ వేవ్స్ ఫోర్స్ నిద్రాస్థితిలోని ఆలోచనా తరంగాల వేగం వంటిదే! దాదాపుగా ఆలోచనలు లేని స్థితి... ఒకటి రెండు ఉన్నా ఆలోచన సాంద్రత తక్కువ. అర నుండి నాలుగు హెర్జ్‌ల ఆలోచనా తరంగాలను డెల్టా వేవ్స్ అవుతుంటాయి. గామా బ్రెయిన్ వేవ్స్‌లో పోల్చితే డెల్టా వేవ్స్ శాతం మూడు నాలుగు మాత్రమే. ఈ తరంగాల ఫోర్స్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ తరంగాలు పెద్దవిగా ఉంటాయి. అంటే నిడివి ఆలోచనలన్నమాట. సులభంగా చెప్పుకోవాలంటే, సంగీతంలో డ్రమ్ బీట్ ఎంత బలంగా శబ్దిస్తుందో అంతే బలంగా ఈ డెల్టా బ్రెయిన్ వేవ్ తాకిడీ ఉంటుంది. ఇంతటి తాకిడి తీవ్ర యోగ సాధనలో, ధ్యానమగ్నతలోనే సాధ్యం.
నిద్రిస్తున్నట్లు, స్పృహ లేనట్లు అనిపించే సమాధి స్థితి ఇది. ఈ స్థితిలో బాహ్య స్పృహ దాదాపుగా ఉండదు. దేహం ఇక్కడే ఉన్నప్పటికీ ఆ దైహిక మనస్సు శూన్యమవుతుంది. యోగి పుంగవులు విశ్వ ప్రేమికులు, ప్రేమస్వరూపులు కావటానికి నేపథ్యం ఇదే! యోగ చికిత్సలు సాధ్యమయ్యేది ప్రేమ స్వభావంతో ఉత్పన్నమయ్యే సంకల్ప బలం వల్లనే. గికంగా అయోనిజ (రిజనరేషన్) ప్రయోగాలు సిద్ధించేది ఈ స్థితిలోనే.
యాస్ట్రల్ స్టేట్ చేరుకున్న వారిలో ఈ డెల్టా వేవ్స్ ఫోర్స్‌ను చూడగలం. యోగా ట్రీట్‌మెంట్స్‌కు కావలసిన యాస్ట్రల్ స్టేట్ లభ్యమయ్యేది ఈ డెల్టా వేవ్స్ స్థిరపడటం వల్లనే. ఆయుర్దాయం పెరిగేది డెల్టా వేవ్స్ ఫోర్స్ వల్లనే.
మొత్తానికి, డెల్టా బ్రెయిన్‌వేవ్ స్టేట్ యోగ పరిభాషలో ‘సమాధి’ స్థితికి చెందింది గాను, శాస్ర్తియంగా ఈ స్థితిని ‘స్లోవేవ్ స్లీప్ స్టేట్’గాను, ఎన్‌ఆర్‌ఇఎం స్లీప్ స్టేట్ మూడవ దశగాను చెప్పుకుంటున్నాం. ఈ డెల్టా బ్రెయిన్ వేవ్‌నే ‘హై ఆంప్లిట్యూడ్ బ్రెయిన్‌వేవ్’ అనీ అంటుంటాం.
* * *
సామాన్యంగా, పురుషులలో కంటే స్ర్తిలలో డెల్టా వేవ్ ఫోర్స్ తీవ్రంగా ఉంటుంది. అంటే, ఆలోచనలు లిమిట్‌గా ఉంటాయి. ఈ లిమిటెడ్ థాట్స్ వల్ల వారు సులభంగా యోగ సిద్ధిని పొందగలరు. వచ్చిన చిక్కు, త్వరగా యోగపరంగా మహిళలు ఆకర్షితులు కారు. అయితే మహిళలు యోగ మార్గంలోకి ప్రవేశించగలిగితే, అతి శీఘ్ర కాలంలోనే నిలదొక్కుకోగలరు. యోగ సిద్ధిని పొందనూగలరు. అందుకే మాస్టర్ సి.వి.వి. యోగ స్థానంలో స్ర్తిలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు.
భార్యాభర్తలిద్దరూ కలిసి యోగం చేసుకోగలిగితే సంపూర్ణ సిద్ధత్వం అన్నది ఇందుకొరకే! సంసారంలో సంయోగం అంటే భార్యాభర్తలిద్దరూ యోగ సాధనలో ‘హాఫ్ కప్ - హాఫ్ కప్’గా సమభాగస్వామ్యం వహించటమే. మాస్టర్ యోగంలో ‘సంపూర్ణత’ అంటే ఈ రెండు హాఫ్‌లు ‘్ఫల్’గా ‘ఏకం’ కావటమే!
సృష్టికి ప్రతిసృష్టి సాధ్యమయ్యేది ఈ ఏకత్వంలోనే! భార్యాభర్తల డెల్టా వేవ్స్ సంయోగించటమే ఈథరల్ రిజనరేషన్. ఈ స్థితిలో సాధ్యమయ్యే పునరుత్పత్తే సృష్టి క్రమంలో తారసపడే ‘అయోనిజ’ సృష్టి. మనకు తెలిసి మాస్టర్ సి.వి.వి. తనయుడు ‘చందూ’ ఇటువంటి సృష్టే. మహాత్మా జీసస్‌ది కూడా ఇటువంటి సృష్టే.
ఇంకొక రహస్యం - వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో డెల్టా వేవ్స్ ప్రాతినిధ్యం పెరుగుతుంటుంది. మనసు పరుగులు పెట్టటం మానుతుంది. పద్ధతిగా కుదురుకోవటం జరుగుతుంది. అందుకే, వయసు పైబడుతున్న కొద్దీ స్ర్తిలలో యోగ వికాసం ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. మహిళల్లో కనిపించే ఇంతటి ‘డెడికేటెడ్‌నెస్’ పురుషుల్లో కొరవడుతున్నట్లుంటుంది. కారణం - అతి త్వరగా ఏదో అయిపోవాలన్న తపన. ఏదో సాధించేయాలన్న ఆతృత. అయితే, పురుషులు అతి పిన్న వయసులోనే యోగ సాధనా మగ్నమవుతుంటే స్ర్తిలు మూడు పదులు దాటితే కానీ యోగంలో కుదురుకోరు. అయినా, ఈ గాప్ వయసు పైబడుతున్న కొద్దీ స్ర్తిలలో కవర్ అవుతుంటుంది. అంతెందుకు, పురుషులు యోగం విషయంలో కాస్తయినా చెదిరే అవకాశముంది. కానీ, స్ర్తిలలో ఒకసారి ఆక్సెప్ట్ చేసిన తర్వాత మనసు మార్చుకునే అవకాశం సామాన్యంగా ఉండదు.
* * *
డెల్టా వేవ్స్ వల్ల గికంగా ఇంతటి సంసిద్ధి, పునర్వికాసం, సంపూర్ణత్వం సాధ్యవైంది. ‘పిట్యుటరీ’కి ‘మహా ప్రాణశక్తి’ మిక్కుటంగా అందటం వల్లనే. పిట్యుటరీకి చేరే మహా ప్రాణ స్పందనల వల్లే గ్రోత్ హార్మోన్స్ విడుదలవుతూ కణ వ్యవస్థ ఆరోగ్యవంత మవుతుంటుంది. కణ ఆయుర్దాయం పెరుగుతూ మానవ ఆయుర్దాయమూ పెరుగుతుంటుంది.
డెల్టా వేవ్స్ ప్రభావం వల్ల సమాధి స్థితి అనేది యోగ నిద్రలా అనిపించినా అది నిత్య చైతన్య స్థితి. నిద్రా స్థితిలో అయినా, యోగావస్థలో అయినా చైతన్య గాఢత అనేది డిస్టర్బెన్స్‌గా మనసు గ్రహించనంత వరకు అది డిసరప్షన్ కాదు. డిసార్డర్ కానేరదు. అందుకే యోగులు నిద్రను యోగ నిద్ర అంటుంటే, విజ్ఞాన ప్రపంచం డెల్టా స్లీప్ అంటుంటుంది. ఇదే గికంగా చెప్పుకునే ‘జాగృత్ సషుప్తి’ ‘తురీయ’ స్థితి. ఈ కారణంగానే డెల్టా బ్రెయిన్ వేవ్స్‌ను ‘మిస్టీరియస్ బ్రెయిన్ వేవ్స్’ అనీ అంటుంటాం.
* ‘మిస్టీరియస్’ అనటానికి కారణం - మనం చైతన్యావస్థలోనే ఉంటున్నప్పటికీ ఆ స్థితిని మాటల్లో వ్యక్తీకరించలేక పోవటం వల్ల.
* మనస్సు శూన్యమయ్యే స్థితి - దాదాపుగా ఆలోచనల తాకిడి లేని స్థితి. ఒక విధంగా బ్రెయిన్ డెడ్‌లా అనిపించే స్థితి.
* విశ్వమూలాలకు అతీత మానసమయ్యే స్థితి. ప్రజ్ఞానం మనలో నెలకొనే స్థితి. దీనే్న ‘ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్’ అనీ అంటుంటాం.
* మాతృ గర్భం నుండి విడివడటానికి పూర్వం, అంటే ప్రసవ పూర్వ దశలో గర్భస్థ శిశువులో ‘ఈ డెల్టా వేవ్స్’ శక్తివంతంగా ఉంటాయి.
* మూడు నెలల నుండి ఏడాది వరకు శిశువు డెల్టా వేవ్స్ బలంగా కొనసాగుతాయి.
* మృత్యువుకు పూర్వ స్థితిలోను అంటే అంత్య దశలోను ఈ డెల్టావేవ్స్ శిశు బ్రెయిన్ వేవ్స్‌ను పోలి ఉంటాయి.
* ధ్యాన స్థితిలో డెల్టా వేవ్స్ ఫోర్స్ బాగా ఉన్నప్పటికీ హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటుంటాయి. ఈ కారణంగానే ధ్యానం బాగా కుదరటం, కుదరకపోవటం అన్న వ్యక్తీకరణలు మన నుండి వస్తుంటాయి.
* డెల్టా వేవ్స్ ఫోర్స్ వల్ల ధ్యాన స్థితిలో దృశ్యమానమైనదేదీ జ్ఞాపకాలుగా కానీ, స్మృతిలో కానీ మిగలవు. అంటే, తురీయ స్థితిలోని అనుభవాలను మనసు రికార్డ్ చేయలేదు. అవి యోగానుభవాలుగా మిగులుతాయే తప్ప అక్షర ప్రపంచంలోకి యథాతథంగా రావు.
* డెల్టా వేవ్స్ మనల్ని అధిభౌతిక జగత్తులో నిలుపుతాయి.