వాసిలి వాకిలి

తొలి ఉచ్ఛ్వాసను, తుది నిశ్వాసను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను
ప్రాణ అపాన ఉదాన వాయు చలనాన్ని
ఇడ పింగళ సుషుమ్మ నాడీ చాలనాన్ని
జనన మరణ ప్రాణ ప్రభంజనాన్ని.
* * *
నేను
మాతృగర్భానికి చతుర్థ మాసాన చేరి, ప్రాణమయ కోశంగా స్థిరపడుతూ, అవయవ నిర్మితికి ప్రాణప్రద మవుతుంటాను. అమ్మలో భాగంగా ఉన్నప్పటికీ స్వతంత్ర, వైయక్తిక ప్రతిపత్తినే. ఇలా వైయక్తిక స్వతంత్రతతో తొలి శ్వాసక్రియ అంటే ఉచ్ఛ్వాసం నుండి తుది శ్వాస క్రియ అంటే నిశ్వాసం వరకు బ్రతుకుతుంటాను.
* * *
అవును, ‘నేను’కు బ్రతుకు అయినా, చావు అయినా ప్రాణకోశంలోనే! మొదటి ఉచ్ఛ్వాస క్రియతో జీవితం ప్రారంభమై ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రాణక్రియలుగా శక్తిసంపన్నమవుతూ తుది నిశ్వాస క్రియతో బ్రతుకు ముగుస్తుంది. అందుకే ప్రాణాన్ని ‘వైటల్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ’ అంటుంటాం.
భూగోళం, వాయుగోళం, సూర్యగోళం ‘నేను’కు ప్రాణ ప్రదాతలు. సూర్య మండలం నుండి సౌరశక్తి, వాయు మండలం నుండి ప్రాణశక్తి, భూమండలం నుండి జీవశక్తి వైటల్ లైఫ్ సోర్స్ ఎనర్జీగా మన దైనందిన జీవితాన్ని శక్తిసంపన్నం చేస్తుంటాయి. మనలోని ఎపిథీలియల్ సెల్స్ భూమండల ప్రభావితాల, మెర్క్యురిసెల్స్ వాయు మండల ప్రభావితాలు, ఫైర్లీ సెల్స్ సూర్యమండల ప్రభావితాలు. ఇవి ప్లానెటరీ ఫోర్సెస్ అయినప్పటికీ వైటల్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీగా మన చైతన్యంలో భాగస్థమవుతుంటాయి. అందుకే ఖగోళ చైతన్యాన్ని మన ప్రాణ చైతన్యంగా పరిగణిస్తుంటాం.
Conscious breathing calms the mind and relaxes the body.. ఒక గిక సాధనతో వన శ్వాసక్రియ సాగుతుండాలి. శబ్దం నిశ్శబ్దమై ప్రాణక్రియలే యోగసాధనలో వైబ్రేషన్స్ అవుతుంటాయి. ఈ వైబ్రేషనే్స పనె్నండు వేల ఎడ్జెస్ట్‌మెంట్స్‌గా మన పంచకోశాలలో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తుంటాయి. ఈ ‘ట్వల్వ్ థౌజండ్ ఎడ్జెస్ట్‌మెంట్స్’ మనలోని డెబ్బై రెండువేల నాడులను స్పందింప చేస్తుంటాయి. ఇడ - పింగళ - సుషుమ్న నాడుల ఫోర్స్‌తో ఈ పనె్నండువేల నాడులు ఇంద్రియ కార్యశీలతకు దోహదపడుతుంటాయి. ఇక - పింగళ - సుషుమ్న నాడులలోను సుషుమ్న నాడీ ఫోర్స్‌ను ‘మెర్రిజోనా ఫోర్స్’గా పరిగణించవచ్చు. పదిహేను వందల లక్షల ఫోర్సెస్ సుషుమ్న నాడి గుండా ఇడ పింగళ నాడులను చేరి దేహ వ్యవస్థలోని డెబ్బై రెండు వేల నాడులను స్పందింప చేస్తుంటాయి. అందుకే In feet binding in "IDA' for "PINGALA' to "SUSHUMNA' for order reveals గా యోగసాధన సాగుతుండాలి. ఇటువంటి యోగసాధనతో మనకు మన ప్రపంచానికి, మన భూగోళానికి, మన ఖగోళానికి, మన సృష్టికి న్యూమోడల్ డెవలప్‌మెంట్ ఎడ్జెస్ట్‌మెంట్స్ జరుగుతుంటాయి.
మనిషి నుండి విశ్వం వరకు ఎడ్జెస్ట్‌మెంట్స్ జరగటం అంటే ‘ట్రీట్‌మెంట్’ అనే కదా! ఇదంతా గిక శిక్షణతో సాధ్యవయ్యే ప్రాణ చికిత్స. మనపరంగా చూసుకుంటే సాధనా సమయంలో మందంగా, గాఢంగా, నెమ్మదిగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగటం వల్ల ‘కార్టిసాల్’ మన నాడీ వ్యవస్థను సక్రమపరుస్తూ గుండెను పదిలపరుస్తుంటుంది. జీర్ణ వ్యవస్థను కుంటుపడకుండా చేస్తుంటుంది. ‘కార్టిసాల్’ అమినో ఆమ్లాలను ఉత్పత్తి చేస్తూ టిష్యూలు క్షీణ దశకు చేరుకోకుండా దోహదపడుతుంటుంది.
‘కార్టిసాల్’ లెవల్స్ సరిగ్గా లేకపోతే సెల్యులర్ డామేజ్ సంభవించి ‘అనారోగ్య’ పాలవుతుంటాం. అంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసల నిడివిని పెంచటం వల్ల, వాటి గాఢతతో భౌతిక శరీర వ్యవస్థ పరిశుద్ధమూ, పరిశుభ్రమూ కావటమే! అందుకే, గికంగా వనం లెక్కించాల్సింది ఎన్ని సంవత్సరాలు బ్రతికామని కాదు.. యోగ సాధనతో దైనందిన కార్యకలాపాలను ఎన్ని తక్కువ సంఖ్యల శ్వాసక్రియలతో సమర్థవంతంగా నిర్వహించగలిగామని. అంటే, తక్కువ శ్వాసక్రియలు ఎక్కువ జీవిత కాలానికి సాధనలు.
దైహికంగా మనది జీవశక్తే అయినప్పటికీ అన్నమయ కోశ వ్యవస్థలో అది పదార్థశక్తి అవుతోంది.. ప్రాణమయ కోశ వ్యవస్థలో ప్రాణశక్తి అవుతోంది. ఇహంగా ఈ ప్రాణశక్తే పరంగా ఖగోళ శక్తి అంటే మానవ శక్తికీ ఖగోళ శక్తికీ డైరెక్ట్ లింక్ ఉందన్నమాట.
ఖగోళం లేనిదే భూగోళం లేదు.. మానవ అవతారం లేదు.. సృష్టీ లేదు. అంతెందుకు - మూవ్‌మెంట్స్, మో షన్స్, వైబ్రేషన్స్ - ఇవన్నీ ప్రాణ ప్రతీకలే! అందుకే అణువులో సైతం ప్రాణం ఉందంటుంటాం. ఇంకా బౌన్సింగ్, మైగ్రేటింగ్, రీ ఇంటిగ్రేటింగ్ అని మనం తరచూ ఉపయోగించే పదాల పరమార్థం సుబోధకం కావాలంటే ప్రాణం ఖరీదు యోగ జీవనంలో తెలిసి రావాల్సిందే!
* * *
అన్నమయ, ప్రాణమయ కోశాలతోపాటు సమప్రాధాన్యత కలది మనోమయ కోశం. ఆలోచనలే ఈ కోశ బలాలు, బలహీనతలు. మనస్సు బలంగా ఉంటే అన్నమయ కోశమూ బలంగా ఉంటుంది. మనస్సు బలహీనపడితే అన్నమయ కోశమూ అనారోగ్య పాలవుతుంది. మన దైనందిన కార్యకలాపాలకు, ఆహార పానీయాలకు ఈ మానసిక స్పృహ ఎంతో అవసరం. నిజానికి, మన మానవతత్వంలోనే అంతర్గతంగా ఒక ఆటోమాటిక్ వర్కింగ్ స్టైల్ ఉంది. విడిగా మన ప్రయత్నం అవసరం లేకపోయినప్పటికీ మనం ప్రకృతి విరుద్ధంగా జీవిస్తుండటం వల్ల మన ప్రయత్నమూ అవసరమవుతోంది.
అన్నమయ కోశం తన వ్యవస్థకు కావలసిన పురమాయింపులను అందుకోవలసింది మనోమయ కోశం నుండే. అయితే, మనోమయ కోశం నుండి అన్నమయ కోశానికి కావలసిన ‘సిగ్నల్స్’ అందటానికి ‘బ్రెయిన్’ ఒక ఉపకరణమే అయినప్పటికీ అవి చేరటానికి కావలసింది నెర్వ్స్ సిస్టమ్. కోమాలో ఉన్న వ్యక్తిని పరిశీలిస్తే ప్రాణమయ, మనోమయ కోశాల పనితీరు సులభంగా అర్థమవుతుంది. కోమాలో ఉన్న మనిషి బ్రతికి ఉండటం అంటే ప్రాణమయ కోశం పని చేస్తున్నట్లే. శ్వాసకోశాలు, గుండె సమర్థవంతంగా తమ విధులు నిర్వహిస్తున్నట్లే. స్పృహ లేకపోవటం అంటే మనోమయ కోశం చచ్చుబడినట్లే.. మనోమయ కోశానికి చెందిన కణాలు తమ సామర్థ్యాన్ని కోల్పోయినట్లే! వాటి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా తగ్గినట్లే! ఇటువంటి అవస్థ నుండి బయటపడటానికి అంటే ఆలోచనలను నియంత్రించుకోవడానికి, మానసికంగా బలపడటానికి మెడిటేషన్ మెడికేషన్ అవుతుంటుంది.
* * *
మనోమయ కోశం అంటే ఒక విధంగా చైతన్య కోశమే! మనస్సంటేనే ఒక స్వయంప్రతిపత్తి గల వ్యవస్థ. అయితే వచ్చిన చిక్కల్లా ప్రాణమయ కోశానిది నిరంతరం పాజిటివ్ ఎనర్జీ అవుతుంటే, మనోమయ కోశం మాత్రం అధికంగా నెగెటివ్ అవుతుంటుంది. అంటే, మనోమయ కోశంలోని శక్తి చైతన్యంలో అధికపాలు నెగెటివిటీ అయితే అల్పపాలు పాజిటివిటీ. అందుకే అంటుం టాం మనసుకు మూడు ముఖాలు, పది తలలు అని.
చేతన, ఉపచేతన, అచేతనలు మూడు ముఖాలయితే దశ పరిణామాలు పది తలలు. నిన్న - నేడు - రేపులు కూడా మానసిక కొలమానాలే! టైమ్ అండ్ స్పేస్‌లు కూడా మానసికోద్భవాలే! మనోమయ కోశానికి చెందిన ఇన్ని అరలను, ఇన్ని పొరలను తీసేయగలది యోగసాధన ఒక్కటే. అందుకే మెడిటేషన్ అనేది మైండ్‌కి సంబంధించింది అవుతోందే తప్ప శరీర సంబంధి కాదు.
* * *
నిన్ను - నన్ను విడదీసేది మనోమయ కోశమే! అందుకే మనస్సును ‘ఇన్‌స్టింక్చుయల్ కాన్షియస్‌నెస్’ అని అంటుంటాం. ఈ చైతన్యంలో భౌతిక ఆలోచనలు, భౌతిక భావనల సాంద్రత ఎక్కువ. గికంగా ‘నిన్న - నన్ను’ కలిపేది కూడా ఈ మనోమయ కోశమే! అయితే ఈ కలయికకు యోగసాధన పరంగా కావలసింది ‘హయ్యర్ మైండ్’... హయ్యర్ కాన్షియస్‌నెస్. ఈ ఊర్థ్వ చైతన్యం నుండి పుట్టుకొచ్చేదే గిక అహం, గిక వ్యక్తిత్వం.
దేహపరంగా, వనోమయ కోశం సేఫ్టీ - సెక్యూరిటీ - ప్రొటెక్షన్ అనే ‘అవసరత్రయం’గా పని చేస్తుంటుంది. మనసు అన్ని విధాల ప్రభావవంతమైంది కాబట్టి మనోమయ కోశ ప్రభావం అటు ప్రాణమయ కోశంపైన, ఇటు అన్నమయ కోశంపైన ఉంటుంది.
మనసుది అధికంగా నెగెటివ్ ఎనర్జీ. ఈ నెగెటివిటీ పాజిటివ్ కావాలంటే - వేగిరపడే మనసుతో సంఘర్షణ పడకుండా దానిని మందగింప చేయటానికి కొంతసేపు మిన్నకుండాలి; ఆ తర్వాత కొద్దిగా మనసుతో స్నేహం చేయటం ప్రారంభించాలి. అంటే దాన్ని చెప్పనివ్వాలి - మనం జోక్యం చేసుకోకుండా వింటుండాలి. తర్వాత విచక్షణతో ఆచరణకు దిగాలి; అది ఇది సాధ్యం కానపుడు మనసును ధ్యానమగ్నం చేయాలి. మెడిటేషన్ వల్ల మన మొండివైఖరీ తగ్గుముఖం పడుతుంది, మనసూ తన మొండితనాన్ని వీడుతుంది.
అసలే, మనసుది కోతి చేష్టలు.. కోతికొమ్మచ్చి ఆటలు. ఈ కొమ్మ నుండి ఆ కొమ్మకు గెంతటమే కోతి ఆట. మనసు కూడా ఇంతే! ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనలోకి దొర్లుకుంటూ పోతుంటుంది. రోజుకి కొన్ని వందల సార్లు ఇలా గెంతుతుంటుంది. గెంతే మనసును స్థిమితపరచాలంటే కనీసం మన దేహం స్థిరాసనంలోకి వెళ్లాలి. అంటే, దేహాన్ని ముందు ధ్యానానికి సమాయత్తపరచాలి. ఆ ధ్యాన స్థితిలో ధారణ అంది వస్తుంది. ఇదే కాన్‌సెన్‌ట్రేషన్‌కు దారితీస్తుంది. ఇలా ధారణ అంటే ఆలోచనలను నియంత్రించటం కాదు.. లోచనకు శిక్షణ నివ్వటం. ఈ క్రమశిక్షణతో మన మైండ్ పాజిటివ్ ఎనర్జీకి కేంద్రమవుతుంది.
మొత్తానికి, పంచకోశాలలో మనోమయ కోశానిది మధ్యమ స్థానం... పైగా ఇహ - పరాల సంయోగస్థలి. అన్నమయ, ప్రాణమయ కోశాలు భౌతిక పరిభాషలో క్రింది కోశాలుగా ఇహానివి అయితే గిక పరిభాషలో విజ్ఞానవయ, ఆనందమయ కోశాలు పై కోశాలుగా పరానివి. మనస్సుది అధికపాలు నెగెటివ్ ఎనర్జీ. కాబట్టి మనస్సును సాధ్యమైనంత వరకు హయ్యర్ ఇంటెలిజెన్స్‌కు, హయ్యర్ కాన్షియస్‌నెస్‌కు ఆవాసం చేయాలి. అప్పుడే మైండ్ అనేది హయ్యర్ మైండ్ అవుతుంది. ఇలా మనోమయ కోశానివి హయ్యర్ ఫన్‌క్షన్స్ అవుతాయి.
నిజానికి, మనస్సు అంటేనే గత చరిత్ర.. అనుభవాల అహం.. జ్ఞాపకాల పొత్తం.. అనవసరాల ఖజానా.. హైకోర్ట్‌లు, సుప్రీంకోర్ట్‌లు అవసరం లేని న్యాయనిర్ణేత.

-విశ్వర్షి 9393933946