ఉత్తరాయణం

అసహనం ఎక్కువైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోదీ ప్రభుత్వం వస్తే మైనారిటీల ఊచకోత, వారిని అణగద్రొక్కటం జరుగుతుందని కాంగ్రెస్, కమ్యూనిస్టు లాంటి పార్టీలు, ములాయంసింగ్, నితీష్ లాంటి నాయకులు కూడ భావించారు. అలాంటి పరిస్థితి ఉండి ఉంటే దాన్ని చూపి లబ్దిపొందవచ్చని కుహనా సెక్యులర్ పార్టీలు భావించాయి. అలా జరగలేదు. మైనారిటీలు పైకి వ్యక్తం చేయకపోయినా మోదీ ప్రభుత్వం తమకు ఏ విధంగా హానికరం లేదని భావిస్తున్నారు. కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాల మయం. మరి మోదీ నేతృత్వంలోని ఎన్.డి. ఏ. పాలనలో కుంభకోణాలు గాని అవినీతి గాని లేదు. అందువల్లనే మోదీకి ప్రజాదరణ. విదేశాలతో మంచి సంబంధ బాంధవ్యాలకోసం శ్రమిస్తున్నారు. విదేశాలలో భారత్‌కు, ఆయనకు మంచి పేరు వస్తున్నది. ఇదంతా ఇతర పార్టీలకు సహించరాని విషయం. అందువలన మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఏ పాలనపై మోదీపై తీవ్ర అసహనం ఎక్కువైనది. ప్రధానమంత్రి పదవి నాశించి భంగపడిన బిహార్ నేత నితీష్‌కుమార్‌కు కూడ మోదీపై అసహనం ఎక్కువైనది. ఆర్.ఎస్.ఎస్. లేని భారత్ కావాలని ప్రకటించాడు. టెర్రరిజం లేని భారత్ కావాలని కోరలేదు. మోదీ పట్ల నితీష్‌కుమార్‌కు వ్యతిరేకత వున్నా నితీష్ పాలన బాగుందని మోదీ మెచ్చుకున్నారు. అది ఆయన గొప్పదనం. బెంగాల్ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రిలు మమతాబెనర్జీ, జయలలితలు కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి అంతంత మాత్రం మెజారిటీ వుంటే మద్దతిచ్చి తమ ప్రయోజనాలు ఒత్తిడి చేసి పొందవచ్చని భావించారు. అత్యధిక మెజారిటీ రావడంతో వారిలో కొంత అసహనం ఎర్పడి వుంటుంది. కావున అందరిలో అసహనం తొలగిపోవాలి.
- జనార్ధన నుగ్గు, జమ్మలమడుగు

సంక్షేమ కార్పొరేషన్‌కు సహకరించండి
ఇంతకాలంగా బ్రాహ్మణులు వారి వారి స్థిరాస్తులను దాన ధర్మాలకు, గ్రామాభివృద్ధికి వెచ్చించి పెద్ద మొత్తంలో తమ ఆస్తులను పోగొటుకున్నారన్నది జగమెరిగిన సత్యం. మంచి కార్యక్రమానికి వెచ్చించి నిరాశ్రయులైన బ్రాహ్మణులకు ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రాహ్మణ సంక్షేమంకోసం కార్పొరేషన్ స్థాపించి పేద బ్రాహ్మణుల అభివృద్ధికి కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకుగాను బ్రాహ్మణులందరు ముఖ్యమంత్రిగారికి రుణపడి ఉన్నారు. సదరు కార్పొరేషన్‌కు సివిల్ సర్వీసులలో స్థిరపడి అనేక పదవులను నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా పదవీ విరమణ పొందిన ఇవైఆర్ కృష్ణారావుగారు చైర్మన్ పదవిని చేపట్టుటకు అంగీకరించడం బ్రాహ్మణులకు ఒక వరం. కృష్ణారావుగారు ప్రస్తుతం కార్పొరేషన్ అధ్యక్షులుగా బ్రాహ్మణుల చదువుకొనుచున్న పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, తల్లిదండ్రులు లేని వారికి ఆర్థిక సహాయము అందించడం కోసం కృషి చేస్తున్నారు. చాణక్య పథకం, అనాధలకు కశ్యప పథకం, భార్గవ పథకం మొదలైనవి అమలు చేస్తూ చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకూ ఆర్థిక సహాయం అందించేందుకు నిరంతర శ్రమ చేస్తున్నారు. కనుక బ్రాహ్మణులందరూ ఈ కార్పొరేషన్‌లలో సభ్యులుగా చేరి మూకుమ్మడిగాఇవైఆర్‌గారికి పూర్తి మద్దతు ఇచ్చి సదరు కార్పొరేషన్ ఉన్నత స్థితికి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
- బొడ్డుపల్లి వెంకట సుబ్రహ్మణ్యశాస్ర్తీ, బాపట్ల

కులాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దు
విద్యార్థులకు, జాతికి దిశానిర్దేశం చేస్తున్న పవిత్ర అధ్యాపక వృత్తిలో వుంటూ ఒక మహాశయుడు ఈమధ్య కాలంలో బాధ్యతారహితంగా యావత్ ప్రపంచానికే గర్వకారణమైన హిందూ సంస్కృతి, సంప్రదాయాలపై విమర్శలు చేయడం బాధాకరం. ముఖ్యంగా హిందూ సంస్కృ తి పరిరక్షణకు కంకణం కట్టుకున్న బ్రాహ్మణులను సోమరులు, దేశదిమ్మరులు, పరకుల విద్వేషకులు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా తన మేధాసంపత్తితో మీడియాలో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ మిగతా కులా ల వారిని బ్రాహ్మణులపై ఉసిగొల్పుతున్నారు. ఈ విధమైన ప్రవర్తన వలనే రాష్ట్రంలో కుల, మత సంఘర్షణలు జరిగే అవకాశం వుంది. ఒక కులాన్ని వేరుచేసి, తక్కువచేసి మాట్లాడడం మంచి పద్ధతి కాదు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

‘ఉచితా’లతో మోసపోవద్దు
ఏటా 14 లక్షల కోట్ల రూపాయలను తమకు ఉచితంగా పంపిణీ చేసే ఆ దేశ ప్రభుత్వ ప్రతిపాదనను 80 శాతం ఆ దేశ జనాభా తిరస్కరించడం వారి విజ్ఞతకు, ఆత్మాభిమానానికి నిదర్శనం! జనాకర్షణకోసం ఉచితాలు, సబ్సిడీల పేర లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సోమరితనాన్ని, అవినీతిని ప్రోత్సహించే ఇటువంటి పథకాలు దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు! ఈ ఉచితాలు, సబ్సిడీల రూపంలో ఇచ్చే ప్రతి రూపాయివల్ల పన్ను చెల్లింపుదారునిపై ప్రత్యక్ష, పరోక్ష భారం 5-6 రెట్లు ఎక్కువగా ఉంటుందని గ్రహించగలిగితే బాధ్యత కలిగిన పౌరుడు ఎవ్వరూ ఈ జనాకర్షక పథకాలను సమర్ధించడు! ఇటువంటి పథకాలవల్ల ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్లకు పైగా ఋణభారంతో కృంగిపోయింది. ఇటువంటి ప్రలోభ పథకాలతో ఓటర్లను మభ్యపెట్టకుండా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు ఇచ్చే ‘ఉచిత’ హామీల వలలో ఓటర్లు పడకూ డదు. ఎందుకం టే వారేమీ వాటిని సొంత పైకం చెల్లించి అమలు పరచ డం లేదు. వివిధ రకాల పన్నులను మన నెత్తిన రుద్ది వాటితోనే ఈ ఉచితాలను అమలు చేస్తారు. ఈ వివేచన కలిగిన ఓటర్లు సోమర్లుగా మార్చే ఇటువంటి పథకాలను ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించరు. ఓటర్లు చైతన్యవంతులైదే అసలు సమస్యలే ఉండవు.
- డా.ఎం.వి.జి.అహోబలరావు, హైదరాబాద్