ఉత్తరాయణం

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్యాన్ని రక్షించమంటూ ఇటీవల ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభలో‘‘ఎన్డీయే ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తోంది, నాగపూర్ నుంచి ఆర్‌ఎస్‌ఎస్ రిమోట్‌తో ప్రభుత్వాన్ని నడుపుతోంది’’ అంటూ సోనియా,‘‘దేశాన్ని ఇద్దరే పాలిస్తున్నారు. వారు మోదీ, మోహన్ భాగవత్’’2 అంటూ రాహుల్ ద్వ జం ఎత్తడం గురివిందలు తమ నలుపెరుగని చందంగా ఉంది. యుపిఎ పదేళ్ల పాలను తెరవెనుక నుంచి ఏకవ్యక్తి సోనియా నడిపిందని ప్రపంచమంతా తెలిసిన విషయమే. చీటికీ మాటికీ పార్లమెంటును స్తంభింపజేసి ప్రజాస్వామ్యాన్ని హతమార్చింది కాంగ్రెస్సే.
- శాంతి చంద్రిక, సామర్లకోట

రెండో రాజధాని నిర్మించాలి
దేశ పరిపాలనా సౌలభ్యంకోసం దక్షిణ భారతదేశంలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని కోరారు. మరి స్వాతంత్య్రం వచ్చి ఇనే్నళ్లు గడిచినా కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా నరేంద్ర మోదీ ప్రభుత్వ ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ఇందుకోసం అనువైన దక్షిణాది రాష్ట్రాన్ని ఎంచుకోవడానికి వీలుగా పరిశీలన జరపాలి.
- మందపల్లి సత్యం, రామచంద్రపురం

వృద్ధులు ఏం పాపం చేశారు?
ప్రజాప్రతినిధుల వేతనాన్ని ప్రస్తుతం చెల్లిస్తున్న మొత్తం నుంచి మూడు రెట్లు పెంచే యోజన ప్రభుత్వానికున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు అడపాదడపా కరువుభత్యం పెరుగుతున్నది. వడ్డీ డబ్బులు మినహా వేరే ఆధారం లేని వృద్ధులు ఏం పాపం చేశారు? బ్యాంకుల ఒత్తిడితో పోస్టల్ శాఖ వడ్డీరేట్లను తగ్గించింది. పక్కనున్న తమిళనాడు ప్రభుత్వ గత ఫిబ్రవరి 24 నుంచి సీనియర్ సిటిజన్స్‌కు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. మరి మన ప్రభుత్వం వృద్ధుల పట్ల ఇంతటి నిరాదరణగా వ్యవహరించడం తగదు.
- బి.ఆర్.సి. మూర్తి, విజయవాడ

చెల్లని నాణేలు
1,2,3,5,10,25 పైసల నాణేలు రద్దు చేయబడ్డాయి. కాని 50 పసల నాణేలు కూడా చెల్లుబాటు కావడం లేదు. రెండు, ఐదు రూపాయల నాణేలు చెల్లుతున్నాయి. కాని నోట్లు చెల్లడం లేదు. ఎన్ని అంతస్తుల భవనానికైనా పునాది మాత్రం భూమిలోనే ఉంటుంది అన్నట్టు నాణేలు ఒక పైసా నుంచి ప్రారంభం కాకపోతే రూపాయికి బలం ఎక్కడినుంచి వస్తుంది? ఒక రూపాయికి ఒక డాలర్ సమానమయ్యే స్వర్ణయుగం వస్తుందని ఆశిద్దాం.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్

ప్రజలకోసం పనిచేయాలి
మన నాయకులు ఎంతసేపు తమ డబ్బా తామే కొట్టుకోవడంతోనే సరిపెట్టుకుంటున్నారు. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు ప్రజలకు చేసిందేమీ లేదుకదా. విదేశీ పర్యనలు తప్ప. ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమీ చేయడంలేదు. కనీసం నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరి తమను గెలిపించిన ప్రజలకోసం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఎవరికీ డిపాజిట్లు కూడా దక్కవు. విడిపోయిన తెలుగు రాష్ట్రాలు ఒకరికి మోదం, మరొకరికి ఖేదం అన్నట్టు మిగిలిపోయాయి. నాయకులు బాగానే ఉంటారు. కష్టపడేది ప్రజలు. అందుకే ప్రజలకోసం నాయకులు మరింత కష్టపడి పనిచేయాలి.
-కురువ శ్రీనివాసులు, హైదరాబాద్

ఆదాయం పెంపునకు అనేక మార్గాలు
ఆర్‌టిసి వారు ఆదాయం పెంపుకోసం అనుసరిస్తున్న మార్గాలు విచిత్రం. పండగ రోజుల్లో, పుష్కరాల సీజనుకి ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా వుంటుంది కనుక దాన్ని ఆసరాగా టికెట్టు ధరను రెండింతలు చేసి, గొప్పగా పెరిగిన ఆదాయం ప్రకటించుకుంటున్నారు. విమానాలకి, ప్రయివేట్ బస్సులకి ఛార్జీలు పెంచడం లేదా అని సరిపుచ్చుకుంటున్నాం. ఇప్పుడు సంస్థవారు ఒక అడుగుముందుకేసి బస్సు, వెనకసీట్లో కూర్చునే వారికి చార్జీలో 20% రాయితీ అట. నిలుచునే వారికి ట్రాప్‌పై కూర్చునే వారికి 50%, 70% రాయితీలు అని కూడా మున్ముందు ప్రకటిస్తారేమో? భయంగా వున్నది.
- తాళాబత్తుల సత్యనారాయణమూర్తి, విశాఖ

సంస్కారం నేర్పని చదువు
దేశంలోకెల్లా అత్యధిక విద్యాధికుల రాష్ట్రంగా కేరళ పేరుపడింది. విద్య సంస్కారాన్ని నేర్పుతుందని కదా మన ధర్మశాస్త్రాలు బోధించినవి. సంస్కారం కొరవడిన కొంతమంది మధాంధులు దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక న్యాయశాస్త్ర విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆపై క్రూరంగా హత్య చేయడం అత్యంత దారుణం. ఈ విషాద సంఘటనను ఖండించడంతో సరిపెట్టుకోక ఈ నరరూప రాక్షసులను కఠినంగా శిక్షించాలి. అప్పుడు మాత్రమే తప్పుడు పనులు చేసే వారికి కనువిప్పు కలుగుతుంది. అంతేకాదు ఇటువంటి సంఘటనలను నిరోధించేందుకు వీలుగా ప్రజల్లో చైతన్య కార్య క్రమా లను నిర్వహించాలి. ప్రజా చైతన్యంతోనే ఇటువంటి సాంఘిక రుగ్మతలను నివారించగలుగుతాం.
-ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్