ఉత్తరాయణం

శాస్తబ్రద్ధ జీవనమే హైందవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగరిక సమాజం ఈ భూమిపై వర్ధిల్లుతున్న నాటినుండి హిందు మతం ప్రాచుర్యంలో వుంది. హిందు మతం అనేది ఒక మతం కంటే మానవుల శాస్తబ్రద్ధ జీవిత విధానం అంటే సమంజసంగా వుంటుంది. హిందు మతంలో వున్న అనేక సత్సంప్రదాయాలు, నియమావళి నుండి రూపురేఖలు మార్చుకొని అనేక ఇతర మతాలు ఉద్భవించాయి. అటువంటి హిందు మతానికి సంబంధించి కొన్ని అంశాలపై కోర్టులు ఇటీవల యిస్తున్న తీర్పు లు పరిశీలిస్తే భారతీయ ఆచార, వ్యవహారాలకు, ఆగమశాస్త్ర నియమావళికి ప్రాధాన్యత యివ్వడంలేదని అర్థవౌతోంది. ఇతర మతాలకు సంబంధించి దాఖలుచేసే వ్యా జ్యాల విషయంలో ఆయా మత పెద్దలతో కూలంకషంగా చర్చించి తీర్పులు యిచ్చే విధానాన్ని హిందు మతం విషయంలో ఎందుకు అనుసరించడం లేదు? ఒక మతం వ్యవహారంలో జోక్యంచేసుకునే ముందు అందులోవున్న ఆచార వ్యవహారాల గురించి లోతైన విశే్లషణ చేసే బాధ్యత వీరిపై వుంది. భక్తి తప్ప లింగవివక్షకు తావీయని సువిశాల దృక్పధంగల హిందు మతంపై అనవసర రాద్ధాంతాలు, జోక్యం అహేతుకం. వివిధ మతాల సాంప్రదాయాలను గౌరవించినప్పుడే దేశంలో సర్వమత సమానత్వం, సాధ్యం.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

నవ్యాంధ్రను నట్టేట ముంచారు
పూర్వం భాగస్తులు అనే సినిమా వచ్చింది. దాన్లో ఒక భాగస్తుడు నష్టపోగా, రెండవ వాడు కోట్లకు పడగ లెత్తుతాడు. శేషాంధ్ర ప్రదేశ్ పరిస్థితి అందుకు భిన్నం కాదు. వద్దు వద్దన్నా విభజించి ఆపాపం కాంగ్రెస్, భాజపా, తలకెత్తుకొని ఆంధ్రప్రదేశ్‌ను నట్టేటముంచా య. ఇకనైనా కేంద్రం కంకణం కట్టుకొని ఆంధ్రకు ప్రత్యే కహోదా కల్పించి వారు నష్టపోయంది పూరించాలి. లేకుంటే భవిష్యత్తులో భాజపా ఆంధ్రప్రదేశ్‌లో కనుమ రుగు కాక తప్పదు.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్టణం

నిబంధనను సడలించాలి
మనది సువిశాల భారతం. దాదాపు మూడుపదుల రాష్ట్రాలు. కోట్లాది నిరుద్యోగులు. అసంఘటిత రంగ కార్మికులు 40కోట్ల మంది. వీరు ఎంత శ్రమించినా భవిష్యత్తు గురించిన విచారం వీరిని దశాబ్దాలుగా వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు మంచిరోజు రానే వచ్చిందనుకోవాలి. ఏదైనా సంస్థలో 20మంది ఉద్యోగులు ఉంటేనే భవిష్యనిధి వర్తిస్తుందని నిబంధన ఉంది. దానిని సడలిస్తే వారి కడగండ్లు తొలగుతాయి అన్న మంచి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. దానిని 10 మందికి తగ్గించేలా మార్పులు చేస్తామని కేంద్రమంత్రి బండారు దత్తాయ్రేత చెప్పడం అభినందనీయం. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టబడి, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వారి జీవితాల్లో వెలుగులు నిండగలవని ఆశిద్దాం. ఇందుకు ప్రజాప్రతినిధుల అందరి సహకారం లభించగలదని విశ్వసిద్దాం. కోట్లాది కార్మికుల ఆ శుభదినానికి సుస్వాగతం!
- ఎన్.సత్యనారాయణాచార్యులు, తెనాలి

‘మత’ రిజర్వేషన్లు వద్దు
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అమలుపై సిఎం చం ద్రబాబునాయుడు తీసుకొన్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైనది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు దేశ సమైక్యత, సమగ్రతకే ముప్పు. ఓటుబ్యాంకు రాజకీయాలకోసం మైనార్టీలకు ఇచ్చే రిజర్వేషన్లు-్భరత రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటుకావని తెలిసినా ఆయావర్గాల వారిని బుజ్జగించేందుకు రిజర్వేషన్లను ప్రకటించడం ఎంతవరకు సబబు? ఇప్పటికే మైనార్టీలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తుండగా మళ్లీ రిజర్వేషన్లు దేనికి? ఆంధ్రలో నేడు కులాల మధ్య రిజర్వేషన్ల చిచ్చు రగులుతుండగా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మాత్రమే మైనార్టీలకి రిజర్వేషన్ల ప్రకటన దోహదం చేస్తుంది. కావున ముస్లింలకు రిజర్వేషన్ల ఆలోచనను ఉపసంహరించుకొని, మైనార్టీల ఆర్థికాభివృద్ధిని ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించగలరని మనవి. కుల మతాల భేదం లేకుండా నిరుపేదలందరికీ ప్రభుత్వం సహాయం సమానంగా అందాలి.
- వేదుల జనార్దనరావు, వంకాయలగూడెం