ఉత్తరాయణం

హైదరాబాద్ పార్కుల దుస్థితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లోని పార్కులలో కొన్ని సరైన పర్యవేక్షణ లేక దుస్థితిలో ఉన్నాయి. చెత్తాచెదారం వలన ఉద్యానవనాల్లోకి వెళ్లాలంటేనే చాలామంది జంకుతున్నారు. మొక్కలు, చెట్లు ‘పోషణ’ లేనందువలన శోషిల్లుతున్నాయి. పరిసరాల నుండి శబ్దకాలుష్యం ఇతర కాలుష్యాలు ఎలాగూ తప్పవు. కొన్ని పార్కులకైతే ప్రహరీగోడలు కూడా లేవు. కాపలాదారులు ఉన్న పార్కులలో ప్రేమికులు అనబడేవారి వెకిలి చేష్టలు అన్నీ ఇన్నీ కావు. కాపలావారకి లంచాలే లంచాలు! సెల్లులు, టీవిలు వంటి వాటివలన ఉద్యానవనాలు సందర్శించాలనే ఆలోచన కలగడం లేదు. వాహనదారులకయితే చార్జీలు వసూలుచేస్తారన్న భయం ఉంది . దీనితోపాటు వాహనాన్ని ఎక్కడ నిలపాలో తెలియక నానా అవస్థపడుతున్నారు. పార్కుల స్థలాలు ఆక్రమణలకు గురవుతూ ఉంటే ప్రభుత్వానికి పట్టినట్లుగా లేదు. ఫుట్‌పాత్‌లు, పార్కులు ఎన్నోచోట్ల ఆక్రమణలకు గురవుతున్నాయి. పార్కులు లేకుండా పోతే విశ్వనగరంగా మారబోతున్న హైదరాబాద్ స్థితి ఏమవుతుందో! ప్రకృతి ప్రేమికులు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఇదే!
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్

కుహనా లౌకికవాదం
సెక్యులరిజం అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించడమా లేక హిందూ సమాజాన్ని ద్వేషించడమా? ముస్లిం, క్రైస్తవ ఓట్లకోసం హిందూ సమాజాన్ని నిరంతరం కించపరచడమా? ఇది హైందవ సమాజం ఎందుకు గుర్తించడం లేదు? ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఇతర మతాల లెక్కలలోకి వెళ్లిపోయాయి. విదేశాలనుండి క్రైస్తవ మతాంతరీకరణకు వేల కోట్ల ధనం ఇండియాకు హద్దూపద్దూ లేకుండా చేరుతోంది. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే హైందవ సమాజం అంతరిస్తుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌నే తీసుకోండి. గత పదిహేను సంవత్సరాల్లో ఎంత మార్పు వచ్చిందో గమనించండి. మతాంతరీకరణలు పెద్ద ఎత్తున జరిగాయి. ఓటు బ్యాంకు రాజకీయాలు నెరపే రాజకీయ పార్టీలను బహిష్కరించకపోతే హైందవ సమాజం నష్టపోతుంది. మెజారిటీ మతాన్ని అణగదొక్కి, మైనారిటీ మతాలను భుజాన వేసుకొని మోస్తున్నారు. ముస్లిం, క్రైస్తవుల ప్రార్థనా స్థలాల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉండదు. కానీ హిందూ ఆలయాల మీద, దేవుళ్లకు భక్తులిచ్చే కానుకలమీద ఇష్టారాజ్యంగా పెత్తనం చెలాయిస్తున్నారు. దేవాలయాలు నిర్మించాలంటే అనుమతులు అక్కర లేదా? హాజ్ యాత్రీకులకు సబ్సిడీలు ఇస్తారు. అదే హిందువులు అమర్‌నాథ్, మానస సరోవరం యాత్రలు చేయాలంటే ఎటువంటి సబ్సిడీలు ఉండవు. ఒకే దేశంలో చట్టాలు భిన్నమెందుకు? దేశం ఒక్కటే, చట్టం కూడా ఒక్కటే ఉండాలి.
- జి. శ్రీనివాసులు, అనంతపురం

ఆత్మహత్యలను నిరోధించాలి
నేడు రికార్డు స్థాయిలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అప్పుల బాధ తట్టుకోలేక రైతులు, వ్యాపారులు, చేనేతకార్మికులు వగైరా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలకు సవాలక్ష కారణాలుంటున్నాయి. ఇటు ప్రభుత్వాలు కాని, స్వచ్ఛంద సంస్థలు కాని ఆత్మహత్యలు నిరోధించడానికి ఏమీ చెయ్యడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై లేదా? ఆత్మహత్యల మూల కారణం తెలుసుకొని నిరోధించాలి.
-కె. వివేక్, విశాఖపట్టం
.